ETV Bharat / sports

T20 World Cup 2021: టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్లేనా? - ఆస్ట్రేలియా-న్యూజిలాండ్

ప్రస్తుత టీ20 ప్రపంచకప్​(t20 world cup 2021)లో టాస్ కీలకపాత్ర పోషిస్తోంది. యూఏఈ పిచ్​ల్లో రాత్రి పూట మంచు ప్రభావమే అందుకు కారణం. అందుకే టాస్(t20 world cup 2021 toss results) గెలిస్తే బౌలింగ్ ఎంచుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు కెప్టెన్లు. నేడు (నవంబర్ 14) ఫైనల్(aus vs nz t20 final) పోరు నేపథ్యంలో ఈ టోర్నీలో టాస్ ప్రభావంపై ఓ లుక్కేద్దాం.

T20 World cup
T20 World cup
author img

By

Published : Nov 14, 2021, 12:07 PM IST

టీ20 ప్రపంచకప్-2021(t20 world cup 2021)లో టాస్​దే ఆధిపత్యం. యూఏఈ పిచ్​లు మ్యాచ్ జరుగుతున్న కొద్ది మార్పులకు లోనవ్వడం, రాత్రి పూట మంచు ప్రభావం వల్ల బౌలర్లకు బంతిపై పట్టుదొరక్కపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఈ టోర్నీలో రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లే ఎక్కువగా గెలిచాయి. దీంతో టాస్ గెలిస్తే చాలు ఫీల్డింగ్ వైపు మొగ్గుచూపిస్తున్నాయి జట్లు. నేడు (నవంబర్ 14) ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరగబోయే ఫైనల్​(aus vs nz t20 final) మ్యాచ్​లోనూ టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్​లో టాస్(t20 world cup 2021 toss results) ప్రభావం ఎంతవరకు ఉంటుందో చూద్దాం.

టాస్ కీలకం

  • ఫైనల్‌ జరిగే దుబాయ్‌లో ఈ ప్రపంచకప్‌లో సూపర్‌ 12 దశ నుంచి జరిగిన 12 మ్యాచ్‌లకు గానూ రెండోసారి బ్యాటింగ్‌ చేసిన జట్లు 11 సార్లు గెలిచాయి.
  • ఇందులో రాత్రిపూట జరిగిన తొమ్మిది మ్యాచ్‌ల్లోనూ ఛేదన చేసిన జట్లే నెగ్గాయి.
  • దుబాయ్‌లో జరిగిన గత 17 టీ20 మ్యాచ్‌ల్లో 16 సార్లు రెండో సారి బ్యాటింగ్‌ చేసిన జట్లదే పైచేయి.
  • ఈ టోర్నీలో ఆసీస్‌కు దక్కిన ఐదు విజయాలు ఛేదనలోనే సొంతమయ్యాయి.

టాస్ గణాంకాలు ఇవి

  • 29- టాస్​ గెలుపు & మ్యాచ్ గెలుపు
  • 15- టాస్ ఓటమి & మ్యాచ్ గెలుపు
  • 13- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నవారు
  • 31- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నవారు
  • 28- మొదటి ఇన్నింగ్స్​లో బౌలింగ్​ చేసి విజయం అందుకున్న మ్యాచ్​లు
  • 16- మొదటి ఇన్నింగ్స్​లో బ్యాటింగ్ చేసి విజయం అందుకున్న మ్యాచ్​లు

ఇవీ చూడండి: AUS vs NZ Final: ఆసీస్​ ఆధిపత్యమా.. కివీస్​ పంతమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.