టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2021) అద్భుత ప్రదర్శనతో సెమీస్ పోటీదారుగా మారింది అఫ్గానిస్థాన్. ఇక డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న వెస్టిండీస్ పేలవ ప్రదర్శనతో టేబుల్లో చివరి స్థానాల్లో ఉంది. అయితే ఈ రెండు జట్ల నుంచి ఒక ప్రత్యేకత ఉంది. ప్రస్తుత ప్రపంచకప్‌లో అత్యంత పిన్న వయస్కుడు, అత్యంత పెద్ద వయస్కుడు అఫ్గాన్, విండీస్‌లోనే ఉన్నారు.
- ప్రస్తుత ప్రపంచకప్‌లో (Youngest Player in T20 World Cup) అత్యంత పిన్న వయస్కుడు- అఫ్గానిస్థాన్‌కు చెందిన రెహ్మనుల్లా గుర్బాజ్ (19 ఏళ్ల 331 రోజులు)
- ప్రస్తుత ప్రపంచకప్‌లో (Oldest Player in T20 World Cup) అత్యంత పెద్ద వయస్కుడు- వెస్టిండీస్ (Chris Gayle News) స్టార్ క్రిస్ గేల్ (42 ఏళ్లు)
- టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడు- పాకిస్థాన్ బౌలర్ మహ్మద్ ఆమిర్ (17 ఏళ్ల 55 రోజులు).. 2009లో ఇంగ్లాండ్‌పై తొలి ప్రపంచకప్ మ్యాచ్ ఆడాడు ఆమిర్.
- టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత పెద్ద వయస్కుడు- హాంగ్‌కాంగ్‌కు చెందిన ర్యాన్ క్యాంప్‌బెల్ (2016లో 44 ఏళ్ల వయసులో ఆడాడు), టెస్టు ఆడే దేశాల్లో అయితే ఆస్ట్రేలియాకు చెందిన బ్రాడ్ హాగ్ (2014లో 43 ఏళ్లప్పుడు ఆడాడు)
నయా రికార్డు..
ఐర్లాండ్‌తో మ్యాచ్ సందర్భంగా నెదర్లాండ్‌కు చెందిన ఐదుగురు బ్యాటర్లు తొలి బంతికే ఔటయ్యారు. ఇది అంతర్జాతీయ టీ20ల్లో సరికొత్త రికార్డు.
ఇదీ చూడండి: yuvraj singh: యువరాజ్ నుంచి గుడ్‌న్యూస్.. మైదానంలోకి రీఎంట్రీ!