దుబాయ్ వేదికగా గురువారం జరిగిన టీ20 ప్రపంచకప్(t20 world cup 2021) రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో మాథ్యూ వేడ్(matthew wade t20 world cup) విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియాకు విజయాన్నందించాడు. షహీన్ అఫ్రిది వేసిన 19వ ఓవర్లో వరుసగా మూడు సిక్సులు బాదిన ఇంకా ఒక ఓవర్ మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించేశాడు. అయితే, అదే ఓవర్లో మూడో బంతికి వేడ్ ఇచ్చిన క్యాచ్‌ను హసన్ అలీ వదిలేశాడు(hasan ali dropped catch). ఒక వేళ ఆ బంతికి తాను ఔటైనా.. కచ్చితంగా తమ జట్టే గెలిచేదని మ్యాచ్ అనంతరం వేడ్(matthew wade t20 world cup) చెప్పాడు.
"ఉత్కంఠభరితంగా మ్యాచ్(aus vs pak t20) సాగుతున్న సమయంలో అలీ క్యాచ్‌ను వదిలేయడం(hasan ali dropped catch) మా జట్టుకు కలిసొచ్చింది. ఒక వేళ ఆ బంతికి నేను ఔటైనా.. కచ్చితంగా మా జట్టే గెలిచేది. ఎందుకంటే, అప్పటికే మార్కస్ స్టోయినిస్ క్రీజులో కుదురుకున్నాడు. నా తర్వాత బ్యాటింగ్‌కు వచ్చే పాట్ కమిన్స్ కూడా భారీ షాట్లు బాదగలడు. అయినా, ఆ సమయంలో ఏం జరుగుతోందో కూడా నాకు అర్థం కాలేదు. వచ్చిన బంతిని వచ్చినట్టుగా బాదడమే లక్ష్యంగా పెట్టుకొన్నాను. ఈ విజయానికి నేనొక్కడినే కారణం కాదు. ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయినా.. వార్నర్ నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు" అని మాథ్యూ(matthew wade t20 world cup) పేర్కొన్నాడు.
ఇదే చివరి మ్యాచ్ అనుకున్నా
"ఈ మ్యాచ్(aus vs pak t20)లో బ్యాటింగ్‌కు దిగేటపుడు ఆస్ట్రేలియా తరఫున ఇదే నా చివరి మ్యాచ్ అనుకున్నా. ఎందుకంటే నేను ఇంకా 23 ఏళ్ల వాడిని కాదు. అందుకే కాస్త ఒత్తిడికి గురయ్యా. ఈ మ్యాచ్ కోల్పోతే సర్వం పోయినట్లు అనుకున్నా. నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనుకున్నా. జట్టుకు నా అవసరం ఉన్నంతవరకు ఆడతా. అలాగే జట్టుకు మరిన్ని విజయాలు అందించాలని అనుకుంటున్నా" అని తెలిపాడు వేడ్(matthew wade t20 world cup).
తొలి సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై విజయం సాధించిన న్యూజిలాండ్(nz vs eng t20) ఇప్పటికే ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై గెలుపొందిన ఆస్ట్రేలియా(aus vs pak t20) కూడా ఫైనల్‌కు చేరుకుంది. ఈ రెండు జట్లు ఆదివారం(నవంబర్ 14) దుబాయ్ వేదికగా టైటిల్ పోరులో(t20 world cup 2021 final date) తలపడనున్నాయి.