ETV Bharat / sports

'టీమ్ఇండియా ఓటమికి టాస్ కారణం కాదు' - సునీల్ గావస్కర్ టీమ్ఇండియా టాస్

టీ20 ప్రపంచకప్(t20 world cup 2021)​లో సెమీస్ చేరకుండానే ఇంటిముఖం పట్టింది టీమ్ఇండియా(team india t 20 world cup). దీంతో ఈ టోర్నీలో భారత్​ ఓటమికి టాస్ కారణమంటూ పలు వ్యాఖ్యలు చేశాడు భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్. దీనిపై స్పందించిన మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్(sunil gavaskar news).. కోహ్లీసేన ఓటమికి టాస్ కారణం కాదని తెలిపాడు.

gavaskar
గావస్కర్
author img

By

Published : Nov 8, 2021, 10:43 AM IST

టీ20 ప్రపంచకప్‌(t20 world cup 2021)లో భాగంగా టీమ్ఇండియా తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. అయితే, ఈ పరాజయాలకు టాస్ కారణం కాదని క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌(sunil gavaskar news) అన్నాడు. టాస్ కారణంగానే కోహ్లీసేన(team india t 20 world cup) పరాజయం పాలైందన్న బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ వ్యాఖ్యలపై గావస్కర్‌ స్పందించాడు. పాకిస్థాన్, న్యూజిలాండ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడం వల్ల మన బ్యాటర్లు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారని.. అందుకే భారత్​(team india t 20 world cup)పై ఆయా జట్లు పైచేయి సాధించాయని అభిప్రాయపడ్డాడు.

"టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియాతో జరిగిన మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌, న్యూజిలాండ్ బౌలర్లు చాలా తెలివిగా బంతులేశారు. అందుకే, భారత బ్యాటర్లు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారు. అయితే, అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ బ్యాటర్లు గొప్పగా పుంజుకున్నారు. స్వేచ్ఛగా ఆడుతూ 200లకు పైగా పరుగులు చేశారు. దీంతో ఆ జట్టుపై భారత్ సులభంగా విజయం సాధించగలిగింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో కూడా భారీగా పరుగులు చేసి ఉంటే కచ్చితంగా టీమ్ఇండియా గెలుపొందేది."

-గావస్కర్‌, మాజీ క్రికెటర్

టీ20 ప్రపంచకప్‌(t20 world cup 2021)లో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమ్ఇండియా(team india t 20 world cup) అంచనాలను అందుకోలేకపోయింది. కనీసం సెమీస్ కూడా చేరకుండానే ఈ మెగా టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత జట్టు పరాజయం పాలుకావడం సెమీస్ అవకాశాలను దెబ్బతీసింది. 2012 టీ20 ప్రపంచకప్‌ తర్వాత టీమ్‌ఇండియా ఓ ఐసీసీ ఈవెంట్లో నాకౌట్‌ దశకు చేరుకోకపోవడం ఇదే తొలిసారి. నామమాత్రమైన ఆఖరి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా(team india t 20 world cup) సోమవారం నమీబియాతో తలపడనుంది.

ఇవీ చూడండి: గొంగడి త్రిష.. భారత జట్టు ఆశాకిరణంగా హైదరాబాదీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.