ETV Bharat / sports

T20 World Cup 2021 Final: టాస్​ గెలిచిన ఆసీస్.. కివీస్ బ్యాటింగ్ - ఆస్ట్రేలియా

టీ20 ప్రపంచకప్​ (T20 World Cup 2021) ఫైనల్లో టాస్​ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో కివీస్ బ్యాటింగ్​కు దిగనుంది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్​ (NZ vs Aus Final) జరుగుతుంది

t20 world cup 2021
టీ20 ప్రపంచకప్​
author img

By

Published : Nov 14, 2021, 7:03 PM IST

Updated : Nov 14, 2021, 7:21 PM IST

తొలిసారి టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2021)​ టైటిల్ గెలిచేందుకు అమీతుమీకి సిద్ధమయ్యాయి ఆస్ట్రేలియా-న్యూజిలాండ్. ఆదివారం జరుగుతున్న ఫైనల్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్​ను (Australia vs New Zealand) బ్యాటింగ్​కు ఆహ్వానించింది.

కివీస్‌ తొలిసారి పొట్టి కప్పులో తుది పోరు ఆడబోతుండగా.. ఆసీస్‌కిది రెండో ఫైనల్‌(AUS vs NZ Final). 2015 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఆసీస్‌ చేతిలో ఓడిన కివీస్‌.. ఇప్పుడా జట్టుపై ప్రతీకారం తీర్చుకుని ఈ ఏడాది రెండో ఐసీసీ ట్రోఫీ అందుకోవాలని చూస్తోంది. ఇప్పటికే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌గా నిలిచిన విలియమ్సన్‌ సేన.. అదే ఊపులో పొట్టి కప్పునూ పట్టేయాలనుకుంటోంది. 2010 ఫైనల్లో ఇంగ్లాండ్‌ చేతిలో ఓడిన ఆసీస్‌.. ఈ సారి మాత్రం ట్రోఫీని వదలకూడదనే పట్టుదలతో ఉంది.

ఆస్ట్రేలియా ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది. కివీస్​ జట్టులో గాయం కారణంగా కాన్వే తప్పుకోగా, అతడి స్థానంలో టిమ్ సీఫర్ట్​ చేరాడు.

జట్లు:

న్యూజిలాండ్: మార్టిన్ గప్తిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టిమ్ సీఫర్ట్​ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్​, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఆడం మిల్నే, టిమ్​ సౌథీ, ఇష్​ సోధీ, ట్రెంట్ బౌల్ట్.

ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (కెప్టెన్), మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్​వెల్, మార్కస్ స్టోయినిస్, మ్యాథ్యూ వేడ్, ప్యాట్ కమిన్స్​, మిచెల్ స్టార్క్, ఆండం జంపా, జోష్ హేజిల్​వుడ్.

ఇదీ చూడండి: AUS vs NZ Final: మ్యాచ్​ను మలుపుతిప్పే సమర్థులు వీరు!

Last Updated : Nov 14, 2021, 7:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.