ETV Bharat / sports

T20 World cup 2021: ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాకు చావో రేవో! - వెస్టిండీస్-ఆస్ట్రేలియా లైవ్

టీ20 ప్రపంచకప్​(T20 World cup 2021)లో భాగంగా గ్రూప్-1లో సెమీస్ బెర్తు ఖరారు చేసుకునేందుకు తాడోపేడో తేల్చుకోనున్నాయి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా. సూపర్-12 దశలో ఈ రెండు జట్లు ఈరోజు (నవంబర్ 6) తమ ఆఖరి మ్యాచ్​ ఆడనున్నాయి.

Australia
ఆస్ట్రేలియా
author img

By

Published : Nov 6, 2021, 7:24 AM IST

టీ20 ప్రపంచకప్‌(T20 World cup 2021) సూపర్‌-12 దశ గ్రూపు-1లో ఆఖరి ఘట్టం. ఈ గ్రూపు నుంచి ఇంగ్లాండ్‌ సెమీఫైనల్లో అడుగుపెట్టగా.. రెండో బెర్తు కోసం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలు తమ అదృష్టం పరీక్షించుకోనున్నాయి. నేడు (నవంబర్ 6) జరిగే మ్యాచ్‌ల్లో వెస్టిండీస్‌తో ఆస్ట్రేలియా(AUS vs WI t20), ఇంగ్లాండ్‌తో దక్షిణాఫ్రికా(ENG vs SA t20) అమీతుమీ తేల్చుకోనున్నాయి.

  • ఆడిన 4 మ్యాచ్‌లు నెగ్గిన ఇంగ్లాండ్‌ 8 పాయింట్లతో ఇప్పటికే సెమీస్‌ చేరుకుంది. నాలుగింట్లో మూడేసి మ్యాచ్‌లు గెలిచి.. ఒక్కోదాంట్లో ఓడిన ఆసీస్‌ (1.031 రన్‌రేట్‌), దక్షిణాఫ్రికా (0.742) ఆరేసి పాయింట్లతో వరుసగా రెండు.. మూడు స్థానాల్లో ఉన్నాయి.
  • శనివారం విండీస్‌పై ఆసీస్‌.. ఇంగ్లాండ్‌పై దక్షిణాఫ్రికా గెలిస్తే ఎనిమిదేసి పాయింట్లతో ఇరుజట్లు సమంగా నిలుస్తాయి. ఈ రెండు జట్లు గెలిస్తే మెరుగైన రన్‌రేట్‌ కలిగిన జట్టు ముందంజ వేస్తుంది.
  • ఒకవేళ ఆసీస్‌, దక్షిణాఫ్రికాలలో ఒక జట్టు గెలిస్తే.. మరో జట్టు సెమీస్‌ చేరుకుంటుంది. బంగ్లాదేశ్‌పై భారీ విజయంతో రన్‌రేట్‌ను గణనీయంగా మెరుగు పరుచుకున్న ఆసీస్‌.. విండీస్‌తో పోరులో ఏం చేస్తుందో చూడాలి.
  • సూపర్‌ 12 దశలో ఓటమే ఎరుగని ఇంగ్లాండ్‌ను దక్షిణాఫ్రికా ఏమేరకు అడ్డుకుంటుందన్నది ఆసక్తికరం. గ్రూపు-1లో శ్రీలంక (4 పాయింట్లు), విండీస్‌ (2), బంగ్లాదేశ్‌ (0)లు సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.