టీ20 ప్రపంచకప్‌లో(T20 World Cup 2021) టీమ్ఇండియా ఆశించిన రీతిలో ఆకట్టుకోలేకపోయింది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన భారత్.. చివరి మూడు మ్యాచ్‌ల్లో విజయాలను సాధించినా సెమీస్‌కు చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కర్(Sunil Gavaskar News) పలు సలహాలు, సూచనలు చేశాడు. పవర్ ప్లే ఓవర్లలో టీమ్ఇండియా బ్యాటింగ్ విధానం మారాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డాడు.
"జట్టులో చాలా మార్పులు చేయడం సరికాదు. ఎందుకంటే భారత్ తన అన్ని మ్యాచ్‌లలో ఓడిపోలేదు. రెండు మ్యాచ్‌లలో బ్యాటర్లు ఆశించిన రీతిలో ఆడలేకపోయారు. టీమ్ఇండియా ప్రస్తుతం ఇలా మధ్యలోనే టోర్నీ నుంచి నిష్క్రమించటానికి కారణం ఇదే. ఈ విధానంలో మార్పు రావాలి"
-- సునీల్ గావస్కర్, మాజీ ఆటగాడు.
'పవర్ ప్లేలో 30 యార్డ్ సర్కిల్ వెలుపల కేవలం ఇద్దరు ఫీల్డర్లు మాత్రమే ఉంటారు. గత కొన్ని ఐసీసీ టోర్నమెంట్‌లలో భారతదేశం దాని ప్రయోజనాన్ని పొందట్లేదు. అందుకే మంచి బౌలర్లు ఉన్న బలమైన జట్టుతో తలపడిన ప్రతిసారీ భారత్ భారీ స్కోర్లు చేయట్లేదు. కాబట్టి ఆ విధానం మారాల్సిన అవసరం ఉంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఫీల్డింగ్‌లో అద్భుతమైన ఆటగాళ్లు ఉండాలి. న్యూజిలాండ్ ఆటగాళ్లు ఫీల్డింగ్ చేసిన విధానం, పరుగులు ఆదా చేయడం, క్యాచ్‌లు పట్టిన తీరు ప్రత్యేకంగా నిలిచాయి. బౌలింగ్ అటాక్ సాధారణంగా ఉన్నప్పటికీ మంచి ఫీల్డింగ్ ఉంటే ఫలితం మరోలా ఉంటుంది. భారత జట్టును పరిశీలిస్తే ముగ్గురు, నలుగురు ఆటగాళ్లు మాత్రమే అత్యుత్తమ రీతిలో ఫీల్డింగ్ చేస్తున్నారు' అని సన్నీ అన్నారు.
ఇదీ చదవండి: