ETV Bharat / sports

'టీమ్‌ఇండియాతో ఫైనల్స్‌ కోసం ఎదురుచూస్తున్నాం' - mauka mauka ad

టీ20 ప్రపంచకప్​లో భాగంగా భారత్-పాకిస్థాన్(IND vs PAK T20)​ మధ్య ఫైనల్​ మ్యాచ్ కోసం వేచి చూస్తున్నట్లు పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్(Shoaib Akthar News) తెలిపాడు. 'మౌకా' ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇకపై మౌకా అనే పదం ఏమాత్రం ఎంటర్‌టైన్మెంట్‌ కాదని పేర్కొన్నాడు.

ind vs pak
భారత్, పాకిస్థాన్
author img

By

Published : Nov 5, 2021, 7:41 AM IST

టీమ్‌ఇండియాతో ఫైనల్స్‌ ఆడేందుకు ఎదురుచూస్తున్నట్లు పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌(Shoaib Akthar News) అన్నాడు. అక్కడ కూడా మరోసారి కోహ్లీసేనను ఓడించాలని ఉందన్నాడు. అందుకోసం భారత్‌ ఫైనల్స్‌కు(IND vs PAK T20) రావాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. అక్కడ టీమ్‌ఇండియా తమని ఓడించడానికి మరో మౌకా (అవకాశం) ఇవ్వాలని ఉందన్నాడు. తాజాగా తన యూట్యూబ్‌ వీడియోలో మాట్లాడిన అక్తర్‌.. భారత్‌ - పాకిస్థాన్‌ మ్యాచ్‌లకు సంబంధించిన 'మౌకా' ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

2015 నుంచి ప్రపంచకప్‌ టోర్నీల్లో భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌లకు సంబంధించి 'మౌకా మౌకా'(Mauka Mauka Ad) పేరిట ప్రకటనలు రూపొందిస్తున్నారు. ప్రపంచకప్‌ టోర్నీల్లో ఇదివరకు దాయాది జట్టుపై భారత్‌ సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిన నేపథ్యంలో భారత్‌కు అనుకూలంగా పాక్‌కు వ్యంగ్యంగా ఆ అడ్వర్టయిజ్‌మెంట్లు ఉండేవి. అయితే, ఇప్పుడు జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా.. పాకిస్థాన్‌ చేతిలో ఓడిన నేపథ్యంలో అక్తర్‌ ఆ యాడ్‌పై తనదైన శైలిలో స్పందించాడు.

"మేం టీమ్‌ఇండియాతో ఫైనల్స్‌ కోసం ఎదురుచూస్తున్నాం. అక్కడ వారిని మరోసారి ఓడించాలని ఉంది. అది జరగాలని మేం కోరుకుంటున్నాం. ఫైనల్స్‌లో టీమ్‌ఇండియాకు మరో మౌకా (అవకాశం) ఇవ్వాలని చూస్తున్నాం. ఇక్కడ నేను 'మౌకా' అని పేర్కొనడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే ఆ పదం ఇప్పుడు పాకిస్థాన్‌ను అపహాస్యం చేసేది కాదు. మామూలుగా ఒక అడ్వర్టయిజ్‌మెంట్‌ రూపొందించడం, అది సరదాగా ఉండటం తప్పేం కాదు. కానీ, ఒక దేశాన్ని కించపరిచే విధంగా ఉండకూడదు. మాది గర్వకారణమైన దేశం. ఇకపై మౌకా అనే పదం ఏమాత్రం ఎంటర్‌టైన్మెంట్‌ కాదు."

- షోయబ్ అక్తర్‌, పాకిస్థాన్ మాజీ క్రికెటర్.

బుధవారం టీమ్‌ఇండియా.. అఫ్గానిస్థాన్‌పై(IND vs AFG T20) గెలుపొందడం వల్ల చాలా మంది పాక్‌ అభిమానులు ఈ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అయ్యిందని పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో విరివిగా పోస్టులు పెడుతున్నారు. దీనిపై స్పందించిన అక్తర్‌.. ఇందులో అనవసరంగా అఫ్గానిస్థాన్‌ను నిందించరాదని కోరాడు. ఆ దేశంలో ప్రస్తుత పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, ఇలా వ్యాఖ్యానించడం పట్ల ఆ జట్టుకు ప్రమాదకరమని చెప్పుకొచ్చాడు. అఫ్గాన్‌ బలమైన జట్టు కాదని, ఈ మ్యాచ్‌లో బలమైన టీమ్‌ఇండియాతో పోటీపడిందని అభిప్రాయపడ్డాడు.

ఇదీ చదవండి:

T20 World Cup: కోహ్లీసేన.. స్కాట్లాండ్​పై జూలు విదిల్చేనా?

మ్యాచ్​ మధ్యలో కెప్టెన్ కోహ్లీ క్రేజీ డ్యాన్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.