ETV Bharat / sports

PAK vs AFG T20: అయ్యో.. టికెట్ కొన్నోళ్లకే ప్రవేశం లేదు! - పాకిస్థాన్ x అఫ్గానిస్థాన్ మ్యాచ్

టీ20 ప్రపంచకప్​లో భాగంగా పాకిస్థాన్, అఫ్గానిస్థాన్​ మధ్య జరుగుతున్న మ్యాచ్​లో(AFG vs PAK T20) ఓ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. టిక్కెట్లు లేకున్నా కొందరు అఫ్గాన్ అభిమానులు మైదానంలోకి గుంపులుగా వెళ్లారు. దీంతో టిక్కెట్లు తీసుకున్న చాలా మంది మైదానంలోకి వెళ్లే అవకాశం లేక వెనుదిరిగారు.

pak vs afg
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్
author img

By

Published : Oct 29, 2021, 10:43 PM IST

టీ20 ప్రపంచకప్​లో(T20 World Cup 2021) భాగంగా నేడు (అక్టోబర్ 29) పాకిస్థాన్, అఫ్గానిస్థాన్​ మధ్య జరుగుతున్న మ్యాచ్​లో(PAK vs AFG T20) ఓ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. దుబాయ్​ అంతర్జాతీయ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్​ను వీక్షించేందుకు పాక్, అఫ్గాన్ అభిమానులు విపరీతంగా వెళ్లారు. ఈ క్రమంలో కొందరు అఫ్గాన్​ అభిమానులు టిక్కెట్లు లేకుండానే గుంపులుగా మైదానంలోకి ప్రవేశించారు. దీంతో టిక్కెట్లు తీసుకున్న పాక్ అభిమానులు తీవ్రంగా ఇబ్బందిపడినట్లు తెలిపారు.

ఈ మ్యాచ్​ను తిలకించేందుకు లండన్​ నుంచి వచ్చిన ఓ పాకిస్థాన్ అభిమాని మైదానంలోకి వెళ్లలేకపోయాడు. కొందరు ఫ్యాన్స్ అక్రమంగా గ్రౌండ్​లోకి వెళ్లడం వల్ల ముందుగానే గేట్లు మూసివేశారని అభిమాని వాపోయాడు. దీంతో మ్యాచ్ చూడకుండానే వెనుదిరుగుతున్నట్లు తెలిపాడు.

కొందరు అఫ్గాన్ అభిమానులు వ్యవహరించిన తీరువల్ల టిక్కెట్లు తీసుకున్న చాలా మంది మ్యాచ్​ను చూసే అవకాశం కోల్పోయారు. అభిమానులను అదుపు చేసేందుకు సెక్యూరిటీ వారు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

మ్యాచ్​ విషయానికొస్తే.. టాస్​ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గాన్​.. ఆరంభంలో కాస్త తడబడింది. అనంతరం పుంజుకొని 148 పరుగులు లక్ష్యాన్ని పాక్​ ముందుంచుంది.

ఇదీ చదవండి:

నబీ, నైబ్ పోరాటం.. పాకిస్థాన్ లక్ష్యం 148

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.