ETV Bharat / sports

KL Rahul News: 'తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటాం' - కేఎల్ రాహుల్ రవిశాస్త్రి

టీ20 ప్రపంచకప్​(t20 world cup 2021)లో విఫలమై అభిమానులను నిరాశపర్చినందుకు ఓ భావోద్వేగ సందేశాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు టీమ్ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్(kl rahul latest news). తప్పులు తెలుసుకుని ముందుకు సాగుతామని తెలిపాడు.

KL Rahul
రాహుల్
author img

By

Published : Nov 10, 2021, 12:01 PM IST

భారీ అంచనాలతో టీ20 ప్రపంచకప్‌(t20 world cup 2021) బరిలోకి దిగిన టీమ్ఇండియా నిరాశపరిచింది. కనీసం సెమీస్‌ కూడా చేరుకోకుండానే నిష్క్రమించింది. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొంటానని ముందుగానే ప్రకటించిన కోహ్లీ(virat kohli captaincy news).. కెప్టెన్‌గా సోమవారం నమీబియాతో చివరి మ్యాచ్‌ ఆడేశాడు. ఈ నేపథ్యంలో యువ ఆటగాడు కేఎల్ రాహుల్‌(kl rahul latest news) తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నాడు. కెప్టెన్‌కు సరైన ఉదాహరణ విరాట్ కోహ్లీ అని ప్రశంసించాడు. టీమ్ఇండియాకు మద్ధతుగా నిలిచిన అభిమానులకు, కోచ్‌ రవిశాస్త్రికి ధన్యవాదాలు తెలిపాడు.

"టీ20 ప్రపంచకప్‌లో మేం నిరాశపరిచాం. మా తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతాం. మేం ఉత్తమ క్రికెటర్లుగా ఎదిగేందుకు మాకు సహకరించిన రవిశాస్త్రికి, గెలుపోటముల్లో టీమ్ఇండియాకు అండగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు. నాయకుడిగా భారత జట్టును ముందుండి నడిపించిన విరాట్‌ కోహ్లీకి కూడా ధన్యవాదాలు. కెప్టెన్సీకి కోహ్లీ ఉదాహరణగా నిలిచాడు."

-రాహుల్, టీమ్ఇండియా క్రికెటర్

టీ20 ప్రపంచకప్‌లో రాహుల్(kl rahul latest news) ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో కలిపి 194 పరుగులు చేశాడు. టీమ్ఇండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇందులో మూడు అర్ధ శతకాలున్నాయి. చివరి మూడు మ్యాచ్‌ల్లో అఫ్గానిస్థాన్‌, స్కాట్లాండ్, నమీబియాలపై రాహుల్‌ హాఫ్ సెంచరీలు చేశాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో పాకిస్థాన్(ind vs pak t20), న్యూజిలాండ్‌లపై టీమ్ఇండియా ఓటమి పాలుకావడం వల్ల టీ20 ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది. నవంబర్‌ 17 నుంచి భారత జట్టు.. న్యూజిలాండ్‌తో తలపడనుంది.

ఇవీ చూడండి: సెలెక్టర్లపై శాంసన్ అసహనం.. ట్వీట్​తో కౌంటర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.