టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించింది న్యూజిలాండ్. తద్వారా పొట్టి మెగాటోర్నీలో తొలిసారి ఫైనల్‌కు చేరుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో దాదాపు ఇంగ్లాండ్ విజయం ఖాయమన్న స్థితిలో క్రీజులోకి వచ్చి కివీస్‌ను గెలుపు గీత దాటించాడు నీషమ్. ఫలితంగా 2019లో వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై ఓటమికి ప్రతీకారం తీర్చుకునేలా చేశాడు.
167 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆదిలోనే గప్తిల్, విలియమ్సన్ వికెట్లు కోల్పోయింది. మరో ఓపెనర్ డారైల్ మిచెల్ (47 బంతుల్ల 72) అద్వితీయ పోరాటంతో కివీస్ కోలుకుంది. కానీ మ్యాచ్ స్వరూపాన్ని మార్చింది మాత్రం నీషమ్. కేవలం 11 బంతుల్లోనే 27 పరుగులు చేసి కివీస్ విజయాన్ని ఖాయం చేశాడు.
ప్రశాంతంగా..
ఊపులో ఉన్న నీషమ్‌ను పెవిలియన్ చేర్చాడు అదిల్ రషీద్. ఆ తర్వాత మిచెల్ 19 ఓవర్ చివరి బంతికి ఫోర్ బాది కివీస్‌కు విజయాన్ని అందించాడు. అంతే ఫైనల్‌కు చేరుకున్నామన్న ఆనందంలో డగౌట్లో అందరూ ఎగిరిగంతులేయగా.. నీషమ్ మాత్రం అలా ప్రశాంతంగా కూర్చిండిపోయాడు. ఇదే ఫొటో నెట్టింట వైరల్‌గా మారగా.. దీనిపై స్పందిస్తూ.. 'పని పూర్తయిందా? నాకైతే అలా అనిపించడం లేదు' అంటూ క్యాప్షన్ పెట్టాడు. అంటే ఫైనల్ మ్యాచ్ ఇంకా మిగిలే ఉందని.. లక్ష్యం టైటిల్ గెలవడమని పరోక్షంగా చెప్పాడు. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
-
Job finished? I don’t think so. https://t.co/uBCLLUuf6B
— Jimmy Neesham (@JimmyNeesh) November 10, 2021 య" class="align-text-top noRightClick twitterSection" data="
య">Job finished? I don’t think so. https://t.co/uBCLLUuf6B
— Jimmy Neesham (@JimmyNeesh) November 10, 2021
యJob finished? I don’t think so. https://t.co/uBCLLUuf6B
— Jimmy Neesham (@JimmyNeesh) November 10, 2021
-
No reaction Neesham. pic.twitter.com/uiDFNQu4Ab
— Johns. (@CricCrazyJohns) November 10, 2021
" class="align-text-top noRightClick twitterSection" data="Jimmy Neesham is still sitting there...#T20WorldCup pic.twitter.com/LNZemm4t1y
— Aadya Sharma (@Aadya_Wisden) November 10, 2021No reaction Neesham. pic.twitter.com/uiDFNQu4Ab
— Johns. (@CricCrazyJohns) November 10, 2021
">Jimmy Neesham is still sitting there...#T20WorldCup pic.twitter.com/LNZemm4t1y
— Aadya Sharma (@Aadya_Wisden) November 10, 2021No reaction Neesham. pic.twitter.com/uiDFNQu4Ab
— Johns. (@CricCrazyJohns) November 10, 2021Jimmy Neesham is still sitting there...#T20WorldCup pic.twitter.com/LNZemm4t1y
— Aadya Sharma (@Aadya_Wisden) November 10, 2021
ఇవీ చూడండి: మాలిక్, రిజ్వాన్‌కు అస్వస్థత.. కీలకపోరు ముందు పాక్‌లో ఆందోళన!