ETV Bharat / sports

'అతడు ఓపెనర్​గా వస్తే పరుగుల వరదే'

author img

By

Published : Oct 29, 2021, 5:06 PM IST

టీమ్​ఇండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఓపెనర్​గా బరిలోకి దిగితే బాగుంటుందని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్(Harbhajan Singh News) అభిప్రాయపడ్డాడు. అతడు ఆడితే పవర్‌ప్లేలో భారత్‌ స్కోర్‌ 60-70 పరుగులుగా నమోదవుతుందని అంచనా వేశాడు. కేఎల్​ రాహుల్ మూడో స్థానంలో ఆడాలని సూచించాడు.

Ishan kishan
ఇషాన్ కిషన్

రోహిత్‌ శర్మతో కలిసి టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌ ఇషాన్‌ కిషన్‌(Ishan Kishan News Update) ఓపెనింగ్‌ చేస్తే బాగుంటుందని, అతడు పవర్‌ప్లేలో 60-70 పరుగులు సాధిస్తాడని వెటరన్‌ క్రికెటర్‌ హర్భజన్‌సింగ్‌(Harbhajan Singh News) అన్నాడు. తాజాగా తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడిన భజ్జీ చాలా విషయాలపై స్పందించాడు. ఇషాన్‌(Ishan Kishan as Opener) కచ్చితంగా ఆడాలని, అది జట్టుకెంతో ముఖ్యమని చెప్పాడు. ఈ యువ బ్యాట్స్‌మన్‌ రోహిత్‌తో కలిసి బరిలోకి దిగితే టీమ్ఇండియాకు అవసరమైన శుభారంభం చేస్తాడన్నాడు. అతడు ఆడితే పవర్‌ప్లేలో భారత్‌ స్కోర్‌ 60-70 పరుగులుగా నమోదవుతుందని అంచనా వేశాడు. అతడు క్రీజులో ఉంటే ప్రత్యర్థి బౌలర్లకు ఒత్తిడి పెరుగుతుందని తెలిపాడు.

అలాగే రోహిత్‌తో కలిసి ఇషాన్‌ ఓపెనింగ్‌ చేస్తే తర్వాత కోహ్లీ, రాహుల్‌, రిషభ్‌ పంత్, హార్దిక్‌ పాండ్యా బ్యాటింగ్‌కు రావాలని భజ్జీ సూచించాడు. పాండ్యా ఆరో స్థానంలో ఉంటూ బ్యాటింగ్‌ చేయాలని.. తనదైన రోజు ఏ బౌలర్‌నైనా చితకబాదుతాడని చెప్పాడు. అతడు బౌలింగ్‌ చేయకపోయినా తుది జట్టులో ఉండాలన్నాడు. టీ20 ఫార్మాట్‌లో ఓపెనింగ్‌ చేయడం, మూడో స్థానంలో ఆడటం లాంటివి తేలికని, అదే ఐదారు స్థానాల్లో బ్యాటింగ్‌ చేయడం కష్టమని అన్నాడు. అక్కడ తొలి బంతి నుంచే దంచికొట్టాలన్నాడు. అందుకు ఆటమీద మంచి అవగాహన ఉండాలన్నాడు. అది హార్దిక్‌కు మెండుగా ఉందన్నాడు.

వరుణ్​ ఆశ్చర్యపరుస్తాడు..

అనంతరం లోయర్‌ ఆర్డర్‌పై స్పందించిన హర్భజన్‌.. ఏడో స్థానంలో రవీంద్ర జడేజా, ఎనిమిదిలో శార్దూల్‌ ఠాకూర్‌, తొమ్మిదిలో బుమ్రా, పదో స్థానంలో షమీ పేర్లు చెప్పాడు. అలాగే చివరగా తన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ సహచరుడు వరుణ్‌ చక్రవర్తి పేరు వెల్లడించాడు. అతడు చాలా తక్కువ మ్యాచ్‌లు ఆడాడని.. కుదురుకోవడానికి సమయం పడుతుందని హర్భజన్‌ అన్నాడు. త్వరలోనే అందరూ అతడిని చూసి ఆశ్చర్యపోతారన్నాడు. అతడు గొప్ప మ్యాచ్‌ విన్నర్‌ అవుతాడన్నాడు. టీమ్‌ఇండియా టీ20 ప్రపంచకప్‌ గెలవడంలో అతడు కీలక పాత్ర పోషిస్తాడని ఈ వెటరన్‌ క్రికెటర్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఇదీ చదవండి:

టీమ్ఇండియా బౌలింగ్ దళంపై మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.