పాకిస్థాన్‌ను ఓడించడం సాధ్యమేనా..? అవతల ఆస్ట్రేలియా ఉన్నప్పుడు ఇలాంటి సందేహాలు చాలా తక్కువగా వస్తాయి..! కానీ ఇప్పుడు సీన్ రివర్సయింది. కంగారూల జట్టు జోరుమీదున్నా ఇప్పుడు పాకిస్థానే(aus vs pak head to head) ఫేవరెట్. ఒకప్పుడు అనిశ్చితికి మారుపేరుగా ఉన్న ఆ జట్టు ఇప్పుడు టీ20 ప్రపంచకప్(t20 world cup 2021)లో కఠినమైన ప్రత్యర్థిగా మారిపోయింది. మరి రెండోసారి పొట్టి కప్పు కొట్టాలన్న కసితో ఉన్న ఆ జట్టును ఓడించడం కంగారూల జట్టుకు సాధ్యమేనా..? తొలిసారి టీ20 ప్రపంచకప్(t20 world cup 2021) నెగ్గాలన్న పట్టుదలతో ఉన్న ఆసీస్ ఫైనల్ చేరుతుందా..? కప్పు కోసం న్యూజిలాండ్‌తో ఫైనల్లో పోటీపడే జట్టేదో నేడు (నవంబర్ 11) తేలిపోనుంది.
విజయమిచ్చిన విశ్వాసంతో..
గతంలో కంటే భిన్నంగా కనిపిస్తోన్న పాకిస్థాన్(aus vs pak t20 2021) ఒత్తిడికి తలవంచకుండా సాగుతోంది. యూఏఈలో చాలా సౌకర్యంగా కనపడుతోంది. అక్కడ అనేక పీఎస్‌ఎల్ మ్యాచ్‌లు ఆడడం, సొంతగడ్డపై ఆడాల్సిన అనేక సిరీస్‌లకు అక్కడ ఆతిథ్యమివ్వడమే అందుకు కారణం. తొలి మ్యాచ్‌లో భారత్‌పై విజయం సాధించాక పాకిస్థాన్.. దుర్భేద్యంగా మారిపోయింది. బాబర్ అజామ్ నేతృత్వంలోని ఆ జట్టు టాప్ ఆర్డర్ బలంగా ఉంది. బాబర్ 264 పరుగులతో టోర్నీ టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. ఓపెనర్లు బాబర్, రిజ్వాన్ విఫలమైనా.. సిక్సర్ల వీరుడు అసిఫ్ అలీ, షోయబ్ మాలిక్, హఫీజ్ రూపంలో పాక్‌కు మిడిల్ ఆర్డర్లో మ్యాచ్ విన్నర్లున్నారు. పాకిస్థాన్ బౌలింగ్ కూడా టోర్నీ ఆరంభం నుంచి ఆకట్టుకుంటోంది. పేసర్లు షహీన్ షా అఫ్రిది, రవూఫ్ బ్యాట్స్‌మెన్‌కు సమస్యలు సృష్టిస్తున్నారు. ఆస్ట్రేలియా అతణ్ని లక్ష్యంగా ఎంచుకునే అవకాశముంది. ఇక స్పిన్నర్లు ఇమాద్ వసీమ్, మహ్మద్ హఫీజ్, షాద్‌బ్ ఖాన్‌లు ఆసీస్‌పై పాక్‌కు ప్రధాన అస్త్రాలు కానున్నారు.
ఆస్ట్రేలియా బలంగా..
ఇంగ్లాండ్ చేతిలో 8 వికెట్ల పరాజయాన్ని మినహాయిస్తే ఆసీస్(aus vs pak t20 2021) టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేసింది. ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ సెమీస్‌కు చేరుకుంది. హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, కమిన్స్‌లతో ఆసీస్ పేస్ విభాగం బలంగా ఉంది. ఇక లెగ్‌స్పిన్నర్ ఆడమ్ జంపా మధ్య ఓవర్లలో క్రమం తప్పకుండా వికెట్లు పడగొడుతున్నాడు. ఆల్‌రౌండర్లు మ్యాక్స్‌వెల్, మిచెల్ మార్ష్‌లు కూడా వికెట్లను అందించారు. ఆస్టన్ అగర్ రూపంలో ఆసీస్‌కు ఎడమచేతి వాటం బౌలర్ కూడా అందుబాటులో ఉన్నాడు. ఆ జట్టుకు అన్నింటికంటే పెద్ద సానుకూలాంశం ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఫామ్‌లోకి రావడం. గత మ్యాచ్‌లో 89 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఓపెనింగ్ జంట వార్నర్, ఫించ్‌లు ఎలాంటి బౌలింగ్‌లోనైనా చెలరేగగలరు. మూడో స్థానంలో వచ్చే మార్ష్ కూడా ఫామ్‌లో ఉన్నాడు. టపటపా వికెట్లు పడితే ఇన్నింగ్స్‌ను కుదుటపరచడానికి స్టీవ్ స్మిత్ ఉన్నాడు. ఇప్పటివరకు పెద్ద మెరుపులు మెరిపించలేకపోయిన మ్యాక్స్‌వెల్.. ఈ మ్యాచ్‌లోనైనా బ్యాటుతో విరుచుకుపడాలని ఆసీస్ కోరుకుంటోంది.
టాస్ గెలిస్తే ఫీల్డింగ్
సెమీఫైనల్ జరగనున్న పిచ్‌పై టోర్నీలో ఇప్పటికే మూడు మ్యాచ్‌లు నిర్వహించారు. బ్యాటింగ్‌కు అనుకూలమైన ఈ పిచ్‌పై మంచు ప్రభావం చూపొచ్చు. టాస్ గెలిచిన జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకోవడం ఖాయం.
- పాకిస్థాన్‌తో ఆడిన నాలుగు ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాదే విజయం.
- యూఏఈలో పాకిస్థాన్ వరుసగా గెలిచిన మ్యాచ్‌ల సంఖ్య. చివరగా ఆ జట్టు 2015 నవంబరులో ఇంగ్లాండ్ చేతిలో ఓడింది.