ETV Bharat / sports

కోహ్లీ పుట్టినరోజు వేడుకలు.. కేక్ కట్ చేయించిన ధోనీ - స్కాట్లాండ్ డ్రెస్సింగ్ రూమ్ లో భారత ఆటగాళ్లు

శుక్రవారం విరాట్ కోహ్లీ 33వ పుట్టినరోజు (virat kohli birthay). ఈ సందర్భంగా స్కాంట్లాండ్(ind vs sco t20)​తో మ్యాచ్ ముగిశాక డ్రెస్సింగ్​ రూమ్​లో విరాట్ బర్త్​ డే సెలబ్రేషన్స్ జరిగాయి. మెంటార్ ధోనీ దగ్గరుండి కోహ్లీ చేత కేక్ కట్ చేయించాడు.

kohli
కోహ్లీ
author img

By

Published : Nov 6, 2021, 1:38 PM IST

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ శుక్రవారం 33వ పుట్టిన రోజు(virat kohli birthay) జరుపుకొన్నాడు. స్కాట్లాండ్‌(ind vs sco t20)తో మ్యాచ్‌ అనంతరం జట్టు ఆటగాళ్లంతా డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఈ వేడుక నిర్వహించి సందడి చేశారు. ఈ సందర్భంగా మెంటార్‌, మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ(ms dhoni news) దగ్గరుండి మరీ కోహ్లీతో కేక్‌ కట్‌ చేయించాడు. ఆ వీడియోను బీసీసీఐ సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకుంది. కాగా, కోహ్లీ కేక్‌ కట్‌ చేశాక సహచరులు అతడి ముఖం నిండా కేక్‌ పూసి సరదాగా గడిపారు.

స్కాట్లాండ్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌లో టీమ్‌ఇండియా..

కాగా, టీమ్‌ఇండియా ఆటగాళ్లు మ్యాచ్‌ అనంతరం స్కాట్లాండ్‌ ఆటగాళ్ల డ్రెస్సింగ్‌ రూమ్‌కెళ్లి సందడి చేశారు. కెప్టెన్‌ కోహ్లీతో పాటు ఆటగాళ్లంతా వారి దగ్గరకెళ్లి కాసేపు ముచ్చటించారు. ఆ ఫొటోలను స్కాట్లాండ్‌ టీమ్‌ ట్విట్టర్​లో పోస్టు చేసి సంతోషం వ్యక్తం చేసింది. టీమ్‌ఇండియా తమ వద్దకు వచ్చి ఇలా మాట్లాడటం బాగుందని కృతజ్ఞతలు తెలిపింది.

టీమ్ఇండియా డ్రెస్సింగ్ రూమ్​లో స్కాట్లాండ్ ఆటగాళ్లు

అనంతరం టీమ్ఇండియా డ్రెస్సింగ్ రూమ్ చూడాలని స్కాట్లాండ్​ క్రికెటర్లు కోరగా అందుకు అనుమతించారు అధికారులు. దీంతో భారత డ్రెస్సింగ్ రూమ్​లో సరదాగా కాసేపు గడిపారు స్కాట్లాండ్ ఆటగాళ్లు. భారత ఆటగాళ్ల వద్ద నుంచి పలు సూచనలు అడిగి తెలుసుకున్నారు.

ఇవీ చూడండి: ఇంకేం చేస్తాం.. బట్టలు సర్దుకోవడమే: జడేజా ఫన్నీ రిప్లై

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.