ETV Bharat / sports

'బయో బబుల్ వల్ల మానసిక అలసట వేధిస్తోంది' - జస్ప్రీత్ బుమ్రా బయోబబుల్ అలసట

టీ20 ప్రపంచకప్​(t20 worldcup 2021)లో చెత్త ప్రదర్శనతో అభిమానుల్ని నిరాశకు గురిచేస్తోంది టీమ్ఇండియా(team India t20 world cup 2021). ఇప్పటికే రెండు మ్యాచ్​లు ఓడి సెమీస్ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది. దీంతో భారత ఆటగాళ్లపై విమర్శలు వస్తున్నాయి. కొందరు టీమ్ఇండియా బిజీ షెడ్యూల్​పై విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై స్పందించాడు పేసర్ బుమ్రా(jasprit bumrah t20 world cup). బయో బబుల్ వల్ల మానసికంగా ఒత్తిడికి గురవుతున్నామని వెల్లడించాడు.

Bumrah
బుమ్రా
author img

By

Published : Nov 1, 2021, 12:46 PM IST

టీ20 ప్రపంచకప్​లో వరుసగా రెండు పరాజయాలు చవిచూసింది టీమ్ఇండియాteam India t20 world cup 2021). దీంతో అటు ఆటగాళ్లు, ఇటు మేనేజ్​మెంట్​పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు పలువురు మాజీలు, అభిమానులు. కొందరు జట్టు సెలక్షన్​ను తప్పుపడుతుంటే మరికొందరు బిజీ షెడ్యూల్​పై మండిపడుతున్నారు. ఆరు నెలలుగా భారత జట్టు బయోబబుల్​లో ఉండటం వల్ల ఆటగాళ్లు మానసికంగా అలిసిపోయారని అంటున్నారు. ఇదే విషయమై స్పందించాడు టీమ్ఇండియా పేసర్ బుమ్రా(jasprit bumrah t20 world cup). కుటుంబాలకు దూరంగా ఉండటం వల్ల ఆ ప్రభావం ఆటగాళ్లపై పడుతోందని తెలిపాడు.

"ఆటగాళ్లకు కొన్నిసార్లు విరామం అవసరం. కుటుంబానికి దూరంగా ఉంటుంటారు. ఆరు నెలలుగా విరామం లేకుండా ఆడుతున్నాం. ఇంత సుదీర్ఘ కాలం కుటుంబానికి దూరంగా, బయోబబుల్​లో ఉండటం వల్ల ఆటగాళ్ల మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. మేమంతా సౌకర్యవంతంగా ఉండేందుకు బీసీసీఐ సాధ్యమైనంత మేర ప్రయత్నిస్తోంది. ఇది చాలా కష్టసమయం. మహమ్మారి ప్రభావం కొనసాగుతోంది. అందువల్ల ఈ బబుల్​కు అలవాటు పడటానికి ప్రయత్నిస్తున్నాం. మానసిక అలసట కూడా వేధిస్తోంది."

-బుమ్రా, టీమ్ఇండియా పేసర్

ఇంగ్లాండ్ పర్యటన తర్వాత ఐపీఎల్​లో అడుగుపెట్టిన టీమ్ఇండియా ఆటగాళ్లు.. ఆ వెంటనే టీ0 ప్రపంచకప్​ కోసం యూఏఈ బయలుదేరారు. దీంతో వీరికి సరైన విరామం లభించట్లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చూడండి: 'భారత్​కు శనిలా తగిలావు'.. అంపైర్​పై ట్రోల్స్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.