పొట్టి ప్రపంచకప్ తుది సమరానికి(t20 world cup final 2021) అంతా సిద్ధమైంది. ఈ టోర్నీలో ఎన్నో అంచనాలతో బరిలో దిగిన టీమ్ఇండియా, వెస్టిండీస్ గ్రూప్ స్టేజీలోనే ఇంటిముఖం పట్టగా.. వరుస విజయాలతో టైటిల్ ఫేవరెట్లుగా కనిపించిన ఇంగ్లాండ్, పాకిస్థాన్ సెమీస్‌లో ఓడి టోర్నీ నుంచి వైదొలిగాయి. ఒత్తిడిని ఛేదిస్తూ, అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఫైనల్(aus vs nz final t20 2021)కు చేరాయి. ఈ రెండు జట్లు ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్ గెలవలేదు. దీంతో ఈ పోరులో ఎవరు గెలిచినా అది సరికొత్త చరిత్రే. ఈ నేపథ్యంలో ఇరుజట్ల గురించి కొన్ని ఆసక్తిక విషయాలు చూద్దాం.
- ఇప్పటివరకు జరిగిన టీ20 ప్రపంచకప్లన్నింటిలో కలిపి ఆస్ట్రేలియా-న్యూజిలాండ్(aus vs nz final t20 2021) ఒక్కసారి మాత్రమే పోటీపడ్డాయి. ఈ మ్యాచ్‌లో కివీస్ 8 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది.
- ఐసీసీ టోర్నమెంట్ నాకౌట్ మ్యాచ్‌ల్లో ఇప్పటివరకు ఆస్ట్రేలియాపై విజయం సాధించలేదు న్యూజిలాండ్. గతంలో ఆసీస్‌తో తలపడిన నాలుగు నాకౌట్ మ్యాచ్‌ల్లోనూ(aus vs nz final t20 2021) కివీస్ ఓటమిపాలైంది. 1996 వన్డే ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్, 2006 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్, 2009 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2015 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో కివీస్‌పై ఆసీస్(aus vs nz final t20 2021) గెలుపొందింది.
- టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. 2007, 2016 టోర్నీల్లో సెమీ ఫైనల్ వరకు వెళ్లగలిగింది.
- ఇప్పటివరకు ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య మొత్తం 14 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఆసీస్ 9, కివీస్ 5 సార్లు గెలిచాయి.
- 2010లో ఇంగ్లాండ్‌పై టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఓటమి తర్వాత పొట్టి మెగాటోర్నీలో తుదిపోరుకు అర్హత సాధించడం ఆస్ట్రేలియాకు ఇదే తొలిసారి.
- ఇప్పటివరకు ఐసీసీ టోర్నీల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు మొత్తం 18 సార్లు తలపడగా అందులో 12 సార్లు కంగారూలే విజయం సాధించారు.
- ఐసీసీ టోర్నీల్లో ఆడిన 31 నాకౌట్ మ్యాచ్‌ల్లో 20 విజయాలు సాధించి దాదాపు అన్ని జట్లపైనా ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయిస్తోంది.