ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో యశస్విని సింగ్(భారత్), ఒలింపిక్ విన్నర్ ఒలేనా కోస్టెవిచ్(ఉక్రెయిన్)ను ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది. 22 ఏళ్ల ఈ అమ్మాయి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 236.7 పాయింట్ల స్కోరుతో విజేతగా నిలిచింది. ఈ విజయంతో షూటింగ్లో టోక్యో ఒలింపిక్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది యశస్విని.
ఈ టోర్నీలో మాజీ ఒలింపిక్ విజేత, ప్రపంచ నెం.1 షూటర్ కోస్టెవిచ్ 234.8 పాయింట్లతో రజతం అందుకోగా.. జాస్మినా మిలోవనోవిక్(సెర్బియా) తర్వాత స్థానంలో నిలిచింది.
ఇప్పటికే షూటింగ్లో అభిషేక్ వర్మ, ఎలెవెనిల్ వలరివన్ స్వర్ణాలు సాధించారు.
ఇప్పటి వరకు 2020 టోక్యో ఒలింపిక్స్‌కు యశస్విని, సంజీవ్ రాజ్‌పుత్, అంజుమ్ మౌద్గిల్, అపూర్వి చందేలా, సౌరభ్ చౌదరి, అభిషేక్ వర్మ, దివ్యాన్ష్ సింగ్ పన్వర్, రాహి సర్నోబాట్, మను బాకర్ అర్హత సాధించారు.
ఇదీ చూడండి: 'ఈ శతకం చూసి మా నాన్న గర్విస్తుంటారు'