ఖేలో ఇండియా క్రీడల్లో డోప్ పరీక్షల్లో విఫలమైన 12 మంది రెజ్లర్లను.. పతకాలు, ప్రశంస పత్రాల్ని వెనక్కి ఇచ్చేయాలని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు డబ్ల్యూఎఫ్‌ఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో తమకు సహాయం అందించాల్సిందిగా రాష్ట్ర సంఘాల్ని డబ్ల్యూఎఫ్‌ఐ కోరింది.
"2018 నుంచి ఖేలో ఇండియా క్రీడలు, స్కూల్ యూత్, యూనివర్సిటీ క్రీడల్లో డోప్ పరీక్షల్లో కొంతమంది క్రీడాకారులు విఫలమయ్యారు. వారి పతకాలు, ప్రశంస పత్రాలు (పార్టిసిపేషన్) వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది" అని డబ్ల్యూఎఫ్‌ఐ సహాయక కార్యదర్శి వినోద్‌కుమార్ తెలిపారు.
ఖేలో ఇండియా క్రీడల్లో పాల్గొన్న ఆర్చరీ, ట్రాక్ అండ్ ఫీల్డ్, రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్‌కు చెందిన పలువురు క్రీడాకారులు.. ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్ స్థాయిలు పెరగేందుకు నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలింది.