ETV Bharat / sports

ఆశ్రమంలో దాక్కున్న స్టార్ రెజ్లర్ సుశీల్? - హత్య కేసులో ఇరుక్కున్న రెజ్లర్ సుశీల్

యువ మల్లయోధుడి మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్.. హరిద్వార్​లోని ఓ ఆశ్రమంలో దాక్కున్నట్లు సమాచారం. ఈ మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఆశ్రమాన్ని సోదా చేసేందుకు ఉన్నతాధికారుల అనుమతి కోసం వేచిచూస్తున్నారు.

susheel
susheel
author img

By

Published : May 14, 2021, 8:31 PM IST

హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్.. ఉత్తరాఖండ్ హరిద్వార్​లోని ఓ ఆశ్రమంలో తలదాచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 4న ఛత్రశాల్ స్టేడియంలో జరిగిన గొడవలో మల్లయోధుడు సాగర్ రానా మృతికి, సుశీల్​కు సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు. దీంతో అతడికి లుక్ ఔట్ నోటీసులు జారీ చేసి, విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదీ చూడండి: రెజ్లర్ సుశీల్​ కుమార్​కు లుక్​ఔట్​ నోటీసులు జారీ

ఈ నేపథ్యంలోనే ప్రముఖ యోగా గురువు ఆశ్రమంలో సుశీల్ తలదాచుకున్నాడనే సమాచారం మేరకు దిల్లీ పోలీసులు హరిద్వార్ చేరుకున్నారు. ఆశ్రమంలో సోదా చేసి సుశీల్​ను అరెస్టు చేయడానికి ఉన్నతాధికారుల అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు.

'సుశీల్​ను వదిలేయండి..'

అయితే సుశీల్​ను వదిలిపెట్టమని సదరు ఆశ్రమ గురువు నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. "ఉత్తరాఖండ్​లోని ప్రసిద్ధ యోగా గురువు మాకు ఫోన్ చేశారు. సుశీల్​ను వదిలేయాలని చెప్పారు. అతడిపై అభియోగాలను కొట్టేసేలా మమ్మల్ని ఒప్పించడానికి ప్రయత్నించారు. సుశీల్.. వారి ఆశ్రమంలోనే ఉన్నాడని మా నమ్మకం. దానిపై నిఘా ఉంచాం. సుశీల్ తప్పించుకోకుండా, ఆశ్రమంలో సోదా చేయడానికి ముందే.. అతడికి వ్యతిరేకంగా సమాచారం సేకరిస్తున్నాం." అని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే సుశీల్ బంధువులు, సన్నిహితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

ఇదీ చూడండి: గొడవల్లో రెజ్లర్ మృతిపై సుశీల్ కుమార్ క్లారిటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.