World Boxing championship Nikhat Zareen: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన నిఖత్ జరీన్.. ఆ ఘనత సాధించిన తొలి తెలుగమ్మాయిగా, మొత్తం మీద భారత అయిదో బాక్సర్‌గా నిలిచింది. రింగ్‌లో సివంగిలా.. ప్రత్యర్థులకు సింహస్వప్నంలా.. పంచ్‌లతో చెలరేగి సరికొత్త చరిత్ర సృష్టించింది. దీంతో ఆమె సాధించిన విజయంతో దేశం ఉప్పొంగిపోయింది. తాజాగా ఈ విజయం ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఈమె తాను విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేసింది. తన అంతిమ లక్ష్యం ఏంటో చెప్పింది.
"ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ గెలవడం నా జీవితంలో ఓ గొప్ప సందర్భం. ఈ విజయాన్ని నా స్నేహితులు, కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాను. ఆడపిల్లలు వివిధ క్రీడల్లో పాల్గొంటూ దేశం గర్వపడేలా చేస్తున్నారు. నేను సాధించిన ఈ గెలుపు కేవలం ఆరంభం మాత్రమే. ప్యారిస్ ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే నా అంతిమ లక్ష్యం. నేను నా శిక్షణను కొనసాగిస్తుంటాను."
-నిఖత్ జరీన్, ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ విజేత
కాగా, అంతకుముందు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మేరీకోమ్ (2002, 2005, 2006, 2008, 2010, 2018) అత్యధికంగా ఆరుసార్లు విజేతగా నిలవగా.. సరితాదేవి (2006), జెన్నీ ఆర్‌ఎల్ (2006), లేఖ (2006) పసిడి పతకాలు సొంతం చేసుకున్నారు.
నిఖత్ మెరుపులు
- టర్కీలో జరిగిన 2011 ప్రపంచ జూనియర్, యూత్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం.
- 2014 నేషన్స్ కప్‌లో స్వర్ణం
- 2015 జాతీయ సీనియర్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం
- 2016 దక్షిణాసియా ఫెడరేషన్ క్రీడల్లో కాంస్యం
- 2018 సెర్బియాలోని బెల్‌గ్రేడ్‌లో జరిగిన టోర్నీలో స్వర్ణం
- 2019 థాయ్‌లాండ్ ఓపెన్లో రజతం
- 2019, 2022ల్లో స్ట్రాంజా మెమోరియల్‌లో పసిడి
ఇదీ చూడండి: nikhat zareen : నిఖత్ మెరుపులు మొదలైందిక్కడే