World Athletics Championships 2023 Neeraj Chopra Final : ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో ఏదో ఒక మెడల్ వస్తే చాలనుకున్న సమయంలో.. రెండేళ్ల కిందట ఏకంగా గోల్డ్ మెడల్ సాధించి అందరూ తనవైపు తిరిగి చూసేలా చేశాడు. అతడే భారత స్టార్ జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా. గోల్డ్ మెడల్ సాధించాక కూడా అతడు తన ఆటను నిలకడ కొనసాగిస్తూ అద్భుత విజయాలతో వరుసగా రికార్డులు బద్దలు కొడుతున్నాడు. కెరీర్లో ఉన్నత స్థాయిలో కొనసాగుతూ ముందుకెళ్తున్నాడు. అయితే ఇప్పుడీ యోధుడి ముంగిట మరో పెద్ద లక్ష్యం నిలిచింది.
అదే.. వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్(World Athletics Championships 2023). ఈ పతకం అతడిని ఊరిస్తోంది. నిరుడు ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో సిల్వర్ మెడల్ దక్కించుకున్న నీరజ్.. ఈసారి ఎలాగైనా గోల్డ్ మెడల్ సాధిస్తాడని అభిమానులు ఎంతో ఆశగా ఉన్నారు. అలాగే నీరజ్ కూడా పట్టుదలతో ఉన్నాడు. మరి నీరజ్ అభిమానుల నమ్మకాన్ని నిలబెడతాడా లేదా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
సాధారణంగా నీరజ్ ఎప్పుడూ.. తనపై పెట్టుకున్న అంచనాలను మించి ప్రదర్శన చేస్తుంటాడు. టోక్యో ఒలింపిక్స్‌లో ఎవ్వరూ ఊహించని విధంగా గోల్డ్ మెడల్ దక్కించుకున్న అతడు.. ఆ తర్వాత డైమండ్ లీగ్‌లోనూ స్వర్ణాన్ని ముద్దాడాడు. అలానే నిరుడు వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో సిల్వర్ సాధించాడు. అలా ఈ సారి వరల్డ్ అథ్లెటిక్స్‌లో గోల్డ్ మెడల్‌పై కన్నేశాడు.
క్వాలిఫయింగ్‌లో ఈ భారత యోధుడి ప్రదర్శన చూశాక గోల్డ్‌మెడల్‌పై భారత అభిమానులు ఆశలు మరింత ఎక్కువైపోయాయి. కేవలం ఒకే త్రోతో 88.77 మీటర్ల దూరం బల్లెంను విసిరి డైరెక్ట్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఈ పెర్ఫార్మెన్స్తో గ్రూప్‌లో అగ్రస్థానం అందుకోవడంతో పాటు పారిస్ ఒలింపిక్స్‌కు బెర్తు కూడా సంపాదించాడు. ఇక ఇదే క్వాలిఫైయింగ్‌లో నీరజ్‌కు అడ్డంకిగా నిలుస్తారనుకున్న జులియన్ వెబర్ (82.39 మీ), వాద్లెచ్ (83.50 మీ) కూడా నీరజ్‌ను అధిగమించలేకపోయారు. మరో ప్రధాన ప్రత్యర్థి అర్షద్ నదీమ్ (86.79) మాత్రమే మెరుగైన ప్రదర్శన చేయగలిగాడు. చూడాలి మరి ఇప్పుడు నీరజ్ ఈ ఫైనల్లో ఎంతవరకు రాణిస్తాడో.. ప్రత్యర్థులు ఎలాంటి సవాళ్లను విసురుతాడో, అభిమానులను నమ్మకాన్ని ఎంత వరకు నిలబెడతాడో...
Neeraj Chopra Paris Olympics : నీరజ్ చోప్రా భళా.. పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత
డైమండ్ లీగ్‌లో సత్తా చాటిన నీరజ్ చోప్రా.. అగ్రస్థానం కైవసం