ETV Bharat / sports

ఒలింపిక్స్​లో గోల్డే నా గురి.. ఆయనతో డ్యాన్స్ చేయాలనుంది : నిఖత్​ జరీన్ - నిఖత్​ జరీన్​ సల్మాన్ ఖాన్

వచ్చే ఒలింపిక్స్​లో స్వర్ణం సాధించేవరకు విశ్రమించేది లేదని బాక్సింగ్​ స్టార్​ నిఖత్​ జరీన్​ మరోసారి స్పష్టం చేసింది. గోల్డ్​ గెలిస్తే.. ఆయనతో ఒక్కసారి డ్యాన్స్​ చేయాలనుందని తన కోరికను బయట పెట్టింది. ఆ వివరాలు..

boxing star nikhat zareen olympic
boxing star nikhat zareen olympic
author img

By

Published : Mar 7, 2023, 8:08 AM IST

ఒలింపిక్స్‌లో గోల్డ్​ మెడల్​ సాధించే వరకు విశ్రమించనని భారత స్టార్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ పునరుద్ఘాటించింది. గతేడాది వరల్డ్​ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌తో పాటు కామన్వెల్త్‌ క్రీడల్లో గోల్డ్​ గెలిచిన తెలంగాణ ముద్దుబిడ్డ.. దిల్లీలో జరిగే ఐబీఏ ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో ఫేవరెట్‌గా బరిలో దిగనుంది. "మరోసారి దేశం గర్వించే ప్రదర్శన చేస్తాననే విశ్వాసం నాకు ఉంది. అయితే, నా అంతిమ లక్ష్యం మాత్రం ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలవడమే. అంతవరకు విశ్రమించను అని నిఖత్​ జరీన్​ చెప్పుకొచ్చింది.

ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తర్వాత కూడా బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ను కలిసి ఆనందాన్ని పంచుకుంటానని తెలిపింది. "నేను సల్మాన్​ ఖాన్​ను కలిసినప్పుడు.. ఆయన్ను చాలా విషయాలు అడుగుదామనుకున్నా. కానీ ఆయన నపై ప్రశ్నలు వర్షం కురింపిచారు. నా ఆట.. నా బ్యాక్​ గ్రౌండ్​.. గురించి చాలా ప్రశ్నలు అడిగారు. అది నేను మరిచిపోలేని అనుభవం. ఇక నేను ఒలింపిక్స్​లో స్వర్ణం సాధిస్తే.. కనీసం ఒక్కసారైనా సల్మాన్​తో కలిసి డ్యాన్స్​ చేస్తా" అని సల్మాన్​పై తన అభిమానం వ్యక్తం చేసింది నిఖత్​ జరీన్.
బాక్సింగ్​ అకాడమీ పెడతా..
ఒలింపిక్స్ స్వర్ణమే నా అంతిమ అల్టిమేట్​ గోల్​ అని​ గతంలోనే నిఖత్​ చెప్పింది. దీంతో పాటు తాన భవిష్యత్​లో ఏం చేయాలనుకుంటుందో అనే విషయం కూడా చెప్పింది. తాను రాబోయే రోజుల్లో బాక్సింగ్ అకాడమీ నెలకొల్పి.. యువతను బాక్సర్లుగా తీర్చిదిద్దాలనుకుంటున్నట్లు చెప్పింది. ఇక, విద్యార్థులందరికి ఆటల్లో ప్రావీణ్యం ఉండాలని సూచించారు. క్రీడలను స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ఏదైనా సాధించాలని కోరారు.

"మీ పిల్లలను క్రీడల పట్ల ప్రోత్సహించాలి. ఫలితంగా క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించి రాష్ట్రానికి, దేశానికి గుర్తింపు తెస్తారు. విద్యార్థులు ఆరోగ్యకరమైన జీవన శైలి అలవర్చుకోవాలి. ఇప్పుడు నా దృష్టంతా ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడంపైనే ఉంది."

- నిఖత్ జరీన్, ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్

తాను ఆరో తరగతిలో ఉన్నప్పుడే క్రీడల పట్ల ఆసక్తి కలిగిందని చెప్పింది. రన్నింగ్, లాంగ్ జంప్, షాట్ పుట్ లాంటి క్రీడల్లో ప్రతిభ కనబరిచానని తెలిపింది. ఇక విద్యార్థులు పలు సూచనలు చేసింది. ఆరోగ్యకరమైన జీవన శైలి అలవర్చుకోవాలని చెప్పింది. పిల్లలు జంక్ ఫుడ్​కు దూరంగా ఉండాలని.. సమతుల ఆహారం తీసుకోవాలని తెలిపింది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని.. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు రోజు వారీ ఆహారంలో భాగం చేసుకోవాలని చెప్పింది. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని నిఖత్ జరీన్ పిలుపునిచ్చింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.