ETV Bharat / sports

పెద్ద వివాదంలో సుశీల్​.. అసలేం జరిగింది? - 'అద్దె చెల్లించకపోవడం వల్లే సుశీల్​ దాడికి దిగాడు!'

భారత స్టార్ రెజ్లర్​ సుశీల్ కుమార్​ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అసలు గొడవ వెనక ఉన్న కారణాలను పోలీసులు వెల్లడించారు. ఇంటి అద్దె విషయంలో వచ్చిన తగాదాలే గొడవకు ప్రధాన కారణమని తెలిపారు. ​

sushil kumar, indian wrestler
సుశీల్ కుమార్, భారత దిగ్గజ రెజ్లర్
author img

By

Published : May 9, 2021, 7:08 AM IST

భారత దిగ్గజ రెజ్లర్‌, రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత సుశీల్‌ కుమార్‌ ఇప్పుడో పెద్ద వివాదంలోనే చిక్కుకున్నాడు. కొన్ని రోజుల కిందట ఓ రెజ్లర్‌ హత్య కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడిగా సుశీల్‌పై ఆరోపణలు రావడం సంచలనం రేపుతోంది. ఈ కేసులో సుశీల్‌ను అరెస్టు చేయడం కోసం పోలీసులు ప్రయత్నిస్తుండగా అతను వాళ్లకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నాడు. సుశీల్‌ ఆచూకీ కోసం ఏకంగా 50 మంది దాకా పోలీసులు ఎనిమిది బృందాలుగా విడిపోయి వెతుకుతున్నారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు.

ఈ నెల 4న దిల్లీలో జరిగిన దాడిలో 23 ఏళ్ల సాగర్‌ దంకడ్‌ అనే జాతీయ స్థాయి రెజ్లర్‌ మరణించాడు. ఆ తర్వాత సుశీల్‌ కుమార్‌ కనిపించకుండా పోయాడు. ఛత్రశాల స్టేడియం ప్రాంగణంలో సాగర్‌తో పాటు అతడి మిత్రులైన సోను మహల్‌, అమిత్‌ కుమార్‌లపై జరిగిన దాడిలో సుశీల్‌తో పాటు అతడి మిత్రులు కొందరు ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. తమపై దాడికి పాల్పడింది సుశీల్‌, అతడి మిత్రులే అని గాయపడ్డ ఓ బాధితుడు పోలీసులకు తెలిపాడు. నిందితుల్లో ఒకడైన రెజ్లర్‌ ప్రిన్స్‌ దలాల్‌ను పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. అతడి మొబైల్‌ ఫోన్‌ను పరిశీలించగా.. దాడికి పాల్పడ్డపుడు తీసిన వీడియో దొరికింది. అందులో స్వయంగా సుశీల్‌ బాధితులపై దాడికి పాల్పడ్డ దృశ్యం కనిపించినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్​కు గంగూలీ.. భారత క్రికెటర్లకు వ్యాక్సిన్​!

సుశీల్‌తో ఒకప్పుడు సాగర్‌కు మంచి సంబంధాలే ఉండేవి. దిల్లీలోని మోడల్‌ టౌన్‌లో సుశీల్‌ ఇంటిలోనే సాగర్‌ అద్దెకు ఉండేవాడు. అయితే కొన్ని నెలల పాటు అద్దె చెల్లించకపోవడం వల్ల అతడితో సుశీల్‌కు గొడవ జరిగింది. నాలుగు నెలల కింద సాగర్‌ ఇల్లు ఖాళీ చేశాడు. అయితే గొడవ సందర్భంగా సుశీల్‌ను దూషించిన సాగర్‌.. ఇతరుల ముందు అతడి గురించి అవమానకరంగా మాట్లాడేవాడట. ఇది తట్టుకోలేక సుశీల్‌ బృందం సాగర్‌పై దాడికి దిగినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: 'ఈ హత్య కేసులో రెజ్లర్​ సుశీల్​దే ప్రధానపాత్ర!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.