ETV Bharat / sports

WFI Elections : WFIకు షాక్​.. సభ్యత్వం రద్దు.. ఇకపై భారత రెజ్లర్లు అలా ఆడలేరు.. - UWW

WFI Election Date 2023 : భారత రెజ్లింగ్ ఫెడరేషన్​కు (WFI) షాకిచ్చింది యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (UWW). డబ్ల్యూఎఫ్‌ఐ సభ్యత్వాన్ని సస్పండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎలక్షన్స్​ను నిర్వహించడంలో డబ్ల్యూఎఫ్ఐ వైఫలమైన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు యూడబ్ల్యూడబ్ల్యూ వెల్లడించింది.

UWW suspends WFI for delaying elections Indian wrestlers won t play under India flag at Worlds
WFI Elections : WFIకు షాక్​.. ఇకపై భారత రెజ్లర్లు అలా ఆడలేరు..
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 24, 2023, 12:33 PM IST

WFI Election Date 2023 : భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) ఎన్నికలపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉన్నాయి. వాయిదా పడుతూ వస్తున్న ఈ ఎలక్షన్స్ ఎప్పుడు నిర్వహించనున్నారో ఇప్పటికీ ఓ స్పష్టత రాలేదు. దీంతో ఇప్పుడు ప్రపంచ వేదికపై ఎదురుదెబ్బ తగిలింది. భారత రెజ్లింగ్ ఫెడరేషన్​కు (WFI) షాకిచ్చింది యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (UWW). డబ్ల్యూఎఫ్‌ఐ సభ్యత్వాన్ని నిరవధికంగా సస్పండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. సమాఖ్య ఎన్నికలను నిర్వహించడంలో డబ్ల్యూఎఫ్ఐ వైఫలమైన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు యూడబ్ల్యూడబ్ల్యూ వెల్లడించింది. దీంతో ఇకపై భారత రెజ్లర్లు.. సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభంకానున్న ఒలింపిక్​ క్వాలిఫైయింగ్​ వరల్డ్ ఛాంపియన్​షిప్స్​ పోటీల్లో న్యూట్రల్​ అథ్లెట్లుగా బరిలోకి దిగాల్సి వస్తుంది. భారత్​ ట్యాగ్​లైన్​ లేకుండానే వారు ఆడాల్సి వస్తుంది.

WFI Elections Postpone : కాగా, ఇటీవలే డబ్ల్యూఎఫ్ఐ వివాదాల్లో చిక్కుకున సంగతి తెలిసిందే. భారతీయ రెజ్లర్ల నిరసనలు, వివిధ రాష్ట్ర విభాగాల నుంచి న్యాయపరమైన పిటిషన్‌ల దాఖలు అయిన కారణంగా ఈ ఎలెక్షన్స్​ పదేపదే వాయిదా పడుతూ వస్తున్నాయి. అసలీ భారత రెజ్లింగ్ ఫెడరేషన్ గవర్నింగ్ బాడీ ఎలక్షన్స్​ మే 2023లో నిర్వహించాల్సి ఉంది. మొదట మే 7న జరగాల్సిన ఎలక్షన్స్​ను క్రీడా మంత్రిత్వ శాఖ నిలిపి వేసింది. జూన్‌ 30 ఎన్నికలు ఉంటాయని అప్పుడు క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. ఆ తర్వాత జులై​ 4న ఎన్నికలు నిర్వహిస్తామని ఐఓఏ పేర్కొంది. కానీ జులై 6న ఎలక్షన్స్​ నిర్వహించాలని రిటర్నింగ్‌ అధికారి నిర్ణయించారు. కానీ తమకూ ఓటు హక్కుందని, గుర్తింపు కోల్పోయిన అయిదు సంఘాలు కోర్టుకు ఎక్కడంతో జులై​ 11కు ఎన్నికలను పోస్ట్ పోన్ వేశారు. ఇప్పటికే ఆ తేదీ దాటిపోయింది. ఆగస్ట్​ కూడా వచ్చేసింది. ఇక ఈ ఎన్నికలు ఈ నెలలోనూ జరిగే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో భారత రెజ్లింగ్ ఫెడరేషన్ సభ్యత్వాన్ని సస్పండ్ చేస్తూ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ నిర్ణయం తీసుకుంది.

కొత్త పార్లమెంట్​ వద్ద టెన్షన్​.. టెన్షన్​.. ముట్టడికి రెజ్లర్ల యత్నం.. అడ్డుకున్న పోలీసులు.. తీవ్ర ఉద్రిక్తత

WFI Elections : జులై 6న రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఎన్నిక.. ప్రకటించిన రిటర్నింగ్ అధికారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.