ETV Bharat / sports

పాలనా వ్యవహారాలకు కొత్త కమిటీ - 'ఇకపై ఆ ముగ్గురే చూసుకుంటారు' - రెజ్లింగ్​ సమాఖ్య న్యూస్

WFI Ad Hoc Committee : భారత రెజ్లింగ్ సమాఖ్య వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే పాలనా వ్యవహారాలను సస్పెండ్​ చేసిన క్రీడా శాఖ తాజాగా ఆ బాధ్యతలను ఓ తాత్కాలిక కమిటీ చేతికి అప్పగించింది.

WFI Ad Hoc Committee
WFI Ad Hoc Committee
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 27, 2023, 9:42 PM IST

WFI Ad Hoc Committee : రెజ్లింగ్​ సమాఖ్య వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇటీవలే కొత్త పాలక వర్గంపై సస్పెన్షన్ వేటు వేసిన కేంద్ర క్రీడాశాఖ తాజాగా రోజువారీ కార్యకలాపాల కోసం అడ్‌హక్‌ కమిటీ ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా భారత ఒలింపిక్‌ సంఘం ఓ తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి భూపిందర్ సింగ్ బజ్వా నేతృత్వం వహించనన్నారు. ఇతర సభ్యులుగా ఎంఎం సోమయా, మంజూష కన్వర్‌ నియమితులయ్యారు. జవాబుదారీతనంతో పాటు పారదర్శకత కోసం ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఐఓఏ ఓ ప్రకటనలో తెలిపింది.

  • Indian Olympic Association constituted an Ad Hoc committee comprising Bhupinder Singh Bajwa as Chairman, MM Somaya and Manjusha Kanwar as Members.

    The committee is given the responsibility to observe and supervise the operations of Wrestling Federation of India (#WFI). It will… pic.twitter.com/mY6ZauOvuC

    — All India Radio News (@airnewsalerts) December 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఇటీవల ఎన్నికైన రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఏకపక్ష నిర్ణయాలను తీసుకున్నారంటున్న విషయం మా దృష్టికి వచ్చింది. అందుకే ఈ తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేశాం" అంటూ ఐఓఏ చీఫ్ పీటీ ఉష ఇటీవలే మీడియాకు వెల్లడించింది.

అసలు ఏం జరిగిందంటే ?
WFI New President : ఇటీవలే నిర్వహించిన డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికల్లో బ్రిజ్‌ భూషణ్ సన్నిహితుడైన సంజయ్‌ సింగ్​కు పగ్గాలను అప్పజెప్పిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వీరికొత్త ప్యానెల్‌ను కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. అండర్‌-15, అండర్‌-20 జాతీయ రెజ్లింగ్‌ పోటీలను హడావుడిగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నందున వారికిపై ఈ వేటు పడింది. అయితే యంగ్ ప్లేయర్స్​ క్రీడాకారులు తమ కెరీర్‌లో ఒక ఏడాదిని కోల్పోకూడదనే ఉద్దేశంతో ఈ పోటీలను త్వరగా నిర్వహించాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు మాజీ డబ్ల్యూఎఫ్​ఐ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ తెలిపారు.

మరోవైపు ఈ సమాఖ్య వ్యవహారాల పర్యవేక్షణ, నియంత్రణ కోసం ఓ తాత్కాలిక ప్యానెల్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ)ను క్రీడామంత్రిత్వ శాఖ కోరింది. అథ్లెట్ల ఎంపిక సహా డబ్ల్యూఎఫ్‌ఐ వ్యవహారాల నిర్వహణ, నియంత్రణ బాధ్యతలు ఈ తాత్కాలిక కమిటీ చూసేందుకు సన్నాహాలు చేయాలంటూ 'ఐవోఏ' చీఫ్‌కు రాసిన లేఖలో క్రీడా శాఖ పేర్కొంది.

Rahul Gandhi Wrestlers Meet : సంజయ్ సింగ్ భారత రెజ్లింగ్ సమాఖ్య-డబ్ల్యూఎఫ్​ఐ అధ్యక్షుడిగా ఎన్నికవడాన్ని నిరసిస్తూ పలువురు మల్లయోధులు అవార్డులు తిరిగి ఇచ్చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వారిని బుధవారం కలిశారు. హరియాణాలోని ఝజ్జర్ జిల్లా ఛరా గ్రామంలో వీరేంద్ర ఆర్య అఖారాకు వెళ్లిన ఆయన రెజ్లర్లతో మాట్లాడారు. కొద్ది సేపు వారితో మట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాహుల్ గాంధీ తమ రెజ్లింగ్ రొటీన్‌ను చూడటానికి మాత్రమే వచ్చారని, ఆయన కూడా సరదాగా మల్లయోధులతో కుస్తీ తలపడ్డారని ప్రముఖ రెజ్లర్‌ బజరంగ్‌ పునియా తెలిపాడు.

'బ్రిజ్ భూషణ్ అనుచరుల పాలనలో పోటీ చేయలేను'- సాక్షి మాలిక్ రిటైర్మెంట్

బ్రిజ్ భూషణ్ అనుచరుడికి పగ్గాలు - రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా సంజయ్ సింగ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.