2017 కామన్వెల్త్ క్రీడల్లో రజతం గెల్చిన భారత వెయిట్‌లిఫ్టర్ సీమపై.. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నాలుగేళ్లు నిషేధం విధించింది. ఈమె నుంచి సేకరించిన మూత్ర నమూనాల్లో నిషేధిత ఉత్ప్రేరకాలు ఉన్నట్లు తేల్చింది.
విశాఖలో జరిగిన 34వ జాతీయ మహిళా వెయిట్‌లిఫ్టింగ్ పోటీలప్పుడు ఈ శాంపిల్స్‌ను సేకరించింది నాడా. శాంపిల్-ఏ లో ఉత్ప్రేరకాలు ఉన్న కారణంగా, శాంపిల్-బీను పరిశీలించారు. అందులోనూ నిషేధిత ఉత్ప్రేరకాల జాడలున్నట్లు తేలింది. ఫలితంగా సీమపై నాలుగేళ్ల నిషేధం పడింది.
ఇవీ చూడండి.. 'కమిన్స్‌ను దేశానికి ప్రధాని చేయండి'