ETV Bharat / sports

2028 ఒలింపిక్సే​ లక్ష్యంగా వ్యూహాలకు పదును - every state to adopt one sport each and focus rizizu

దేశంలోని ప్రతి రాష్ట్రం ఒక్కో క్రీడపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు క్రీడా శాఖ మంత్రి కిరణ్​ రిజిజు. ఇలా చేస్తే తదుపరి ఒలింపిక్స్​లో అధిక పతకాలు సాధించడమే కాకుండా.. 2028లో టాప్​-10లో నిలిచే అవకాశాలున్నాయని అన్నారు.

rizizu
రిజిజు
author img

By

Published : Jul 9, 2020, 5:45 AM IST

2028 లాస్​ ఏంజెలిస్​ ఒలింపిక్సే లక్ష్యంగా.. వ్యూహాలకు పదును పెడుతున్నట్లు తెలిపారు క్రీడా శాఖ మంత్రి కిరణ్​ రిజిజు. ఆ ఒలింపిక్స్​లో భారత్​ అధిక పతకాలు సాధించడమే లక్ష్యంగా వ్యూహాత్మకమైన పద్ధతిని ఎంచుకున్నట్లు తెలిపారు. ప్రతి రాష్ట్రం ఒక్కో క్రీడపై ప్రత్యేక దృష్టి సారించి.. దానికి సంబంధించిన అథ్లెట్లను మరింత మెరుగ్గా ఆడేలా తీర్చిదిద్దాలని ఆయా రాష్ట్రప్రభుత్వాలను కోరినట్లు వెల్లడించారు కిరణ్​. దీంతో పాటు మిగతా ఆటలను తమ శక్తి మేరకు ప్రోత్సహించాలని తెలిపారు.

ఈ విధమైన వ్యూహత్మకమైన పద్ధతిని పాటించడం వల్ల టోక్యో ఒలింపిక్స్​లోనే కాకుండా ​2028 లాస్ ఏంజెలిస్​ ఒలింపిక్స్‌ పతకాల జాబితాలో భారత్ టాప్ -10లో నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే 14 రాష్ట్రాలు 14 క్రీడలను ఎంచుకుని వాటిపై పూర్తిస్థాయి దృష్టి సారించి కసరత్తులు చేస్తునాయన్నారు. అందులో రెజ్లింగ్​, ఆర్చరీ, బాక్సింగ్​, హాకీ, షూటింగ్​ తదితర క్రీడలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.

కలిసి పనిచేయాలి

ఒలింపిక్స్​లో భారత్​ తన సత్తా చాటాలంటే స్పోర్ట్స్​ ఫెడరేషన్స్​, ప్రభుత్వం, కార్పొరేట్​ వ్యవస్థ కలిసి సంయుక్తంగా పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు రిజిజు. ప్రతిభ కనబరిచిన అథ్లెట్లను మెరుగైన శిక్షణ కోసం ఈ కార్పొరేట్​ సంస్థలు తయారు చేసిన మెరుగైన సౌకర్యాలతో కూడిన శిక్షణ శిబిరాలకు పంపిస్తామని తెలిపారు.

ఇది చూడండి : బాలీవుడ్​ సినిమాలా అనిపించే 'సౌరభ్ గంగూలీ' ప్రేమకథ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.