మే 1 నుంచి ప్రారంభం కానున్న ప్రపంచ బాక్సింగ్ కౌన్సిల్(డబ్ల్యూబీసీ) ఛాంపియన్షిప్ పోటీలు వాయిదా పడ్డాయి. దేశవ్యాప్తంగా కొవిడ్ విధ్వంసం సృష్టిస్తున్న నేపథ్యంలో ఈ పోటీలను వాయిదా వేస్తూ ఎల్‌జెడ్ ప్రమోషన్స్ నిర్ణయం తీసుకుంది. ఈ పోటీలకు పంజాబ్ జలంధర్‌లోని గ్రేట్ ఖాలీ అకాడమీ వేదికగా జరగాల్సి ఉంది.
ఈ డబ్ల్యూబీసీ ఛాంపియన్షిప్ పోటీలకు భారత్ తొలిసారి ఆతిథ్యమివ్వబోతోంది. మొదటి మ్యాచ్ చాందిని మెహ్రా, సుమన్ కుమారి మధ్య జరగాల్సి ఉంది. "కరోనా కారణంగా తొలి సారి భారత్ వేదికగా జరగనున్న ప్రపంచ బాక్సింగ్ కౌన్సిల్ ఛాంపియన్ పోటీలు దురదృష్టవశాత్తూ వాయిదా పడ్డాయి. తదుపరి తేదీలను ప్రకటించాల్సి ఉంది" అని ఎల్‌జెడ్ ప్రమోషన్స్ సీఈఓ ప్రకటించారు.
ఇవీ చదవండి: 'భారత్, కివీస్ ఆటగాళ్లతో మమ్మల్నీ పంపించండి'