బ్రిటన్‌కు చెందిన 11 ఏళ్ల బాలిక స్కై బ్రౌన్.. వచ్చే ఏడాది జరగనున్న ఒలింపిక్స్‌లో స్కేట్‌బోర్డు పోటీల్లో పాల్గొనాలి అనుకుంటోంది. ఇందుకోసం తీవ్రంగా శ్రమిస్తోందీ చిన్నారి. ఇప్పటికే ఈ ఏడాది ఐరోపా, ఆసియా, దక్షిణ అమెరికాల్లో జరిగిన స్కేటింగ్ టోర్నీల్లో సత్తా చాటింది.
ముఖ్యంగా ఫ్రంట్‌సైడ్ ట్రిక్‌లతో అద్భుతమైన ప్రదర్శన చేసింది. స్కేట్‌బోర్డ్‌లో ఇంత వరకూ మహిళలు చేయని ట్రిక్‌లను ఈ బాలిక అవలీలగా చేస్తూ ఆకట్టుకుంది.
స్కై బ్రౌన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు:-
⦁ మూడేళ్ల వయసులోనే స్కేట్బోర్డింగ్ చేయటం ప్రారంభించింది.
⦁ 2016లో జరిగిన వాన్స్ యూఎస్ ఓపెన్ ప్రో సిరీస్‌లో పాల్గొన్న అతి చిన్న వయస్కురాలిగా ఘనత సాధించింది.
⦁ ఫిబ్రవరిలో నైక్ కంపెనీ "డ్రీం క్రేజియర్" ప్రచారంలో చేరిన అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది.
⦁ బ్రౌన్ టోక్యో 2020 కి అర్హత సాధిస్తే, ఆమె గ్రేట్ బ్రిటన్‌కు చెందిన అతి పిన్న వయస్కురాలైన ఒలింపియన్ అవుతుంది.
ఇదీ చదవండి:- మళ్లీ మైదానంలోకి ఎప్పుడొస్తానో తెలియదు