ETV Bharat / sports

'దేశవ్యాప్తంగా 1000 ఖేలో ఇండియా కేంద్రాలు'

క్రీడల అభివృద్ధి కోసం దేశవ్యాప్తంగా వెయ్యి ఖేలో ఇండియా కేంద్రాలను స్థాపిస్తామని క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2028 ఒలింపిక్స్​లో భారత్​ను టాప్​-10లో ఉంచడమే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపింది.

Want to start 1,000 Khelo India centres at district level across India
'దేశవ్యాప్తంగా వెయ్యి స్పోర్ట్స్​ సెంటర్లు స్థాపిస్తాం'
author img

By

Published : Jan 18, 2021, 8:07 PM IST

దేశవ్యాప్తంగా జిల్లా స్థాయిలో.. 'వెయ్యి ఖేలో ఇండియా కేంద్రాలు'ను స్థాపించనున్నట్లు కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్​ రిజిజు తెలిపారు. మహారాష్ట్ర పుణేలో, శ్రీ శివ​ ఛత్రపతి స్పోర్ట్స్​ కాంప్లెక్స్​లో.. 'ఖేలో ఇండియా స్టేట్​ సెంటర్ ఆఫ్​ ఎక్స​లెన్స్​'ను మంత్రి ప్రారంభించారు.

2028 ఒలింపిక్స్​లో భారత్​ టాప్​-10లో ఉండాలనేది మా లక్ష్యం. అందుకు క్షేత్ర స్థాయి నుంచి క్రీడా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సంకల్పించాం. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా వెయ్యి ఖేలో ఇండియా క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం. దేశంలో సుమారు 700 జిల్లాలున్నాయి. అంటే జిల్లాకు ఒక కేంద్రం తప్పక వస్తుంది. ఇంకొన్ని జిల్లాల్లో అంతకుమించి వచ్చే అవకాశం ఉంది.

-కిరణ్ రిజిజు, కేంద్ర క్రీడల శాఖ మంత్రి.

భవిష్యత్తులో ఛాంపియన్లను తయారు చేసే సత్తా పుణేకు ఉందన్నారు కేంద్ర మంత్రి. ఈ ప్రాంతం మహారాష్ట్రకు మాత్రమే కాదు.. మొత్తం దేశానికే ఒక క్రీడా కేంద్రమని పేర్కొన్నారు. దేశం మొత్తంలో 23 ఎక్స​లెన్స్​ సెంటర్లు ఉంటే.. ఒక్క మహారాష్ట్రలోనే మూడు నెలకొని ఉన్నాయని తెలిపారు.

ఇదీ చదవండి: 'సిరాజ్​ ఇక ఎంత మాత్రం కుర్రాడు కాదు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.