ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ రెజ్లర్ వినీశ్ ఫొగాట్ శుభారంభం చేసింది. 53కేజీల విభాగంలో ఈ రెజ్లర్ ఒలింపిక్స్ కాంస్య విజేత సోఫియా మ్యాట్సన్(స్వీడన్)ను తొలి రౌండ్లో ఓడించింది. 13-0 తేడాతో గెలిచి రెండో రౌండ్‌కు అర్హత సాధించింది వినీశ్.
ఈ ఏడాదే 50 నుంచి 53 కేజీల విభాగానికి మారిన వినీశ్ వరుస టైటిల్స్‌తో దూసుకుపోతుంది. ఇప్పటికే ఐదు టోర్నీల్లో ఫైనల్స్ చేరి మూడు స్వర్ణాలు నెగ్గింది. యాజర్ డోగు, స్పెయిన్ గ్రాండ్ పిక్స్, పొలాండ్ ఓపెన్‌లో పసిడి పతకాలు కైవసం చేసుకుంది.
ఈ నెల14 నుంచి 22 వరకు నుర్‌సుల్తాన్(కజికిస్థాన్)లో ఈ పోటీలు జరుగుతున్నాయి. ఈ టోర్నీలో మెుదటి ఆరు స్థానాల్లో నిలిచిన రెజ్లర్లు 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు.
ఇదీ చూడండి: 'ధోనీ రిటైర్మెంట్ విషయాన్ని వారే తేల్చాలి'