ETV Bharat / sports

విజేందర్​​ విజయాలకు బ్రేక్​ - ప్రొ బాక్సింగ్​లో తొలి ఓటమి

author img

By

Published : Mar 20, 2021, 4:46 AM IST

Updated : Mar 20, 2021, 6:18 AM IST

ప్రొఫెషనల్​ బాక్సర్​ విజేందర్​ సింగ్​ విజయపరంపరకు బ్రేక్​ పడింది. ప్రొ-బాక్సింగ్​లో అతడు తొలి ఓటమిని ఎదుర్కొన్నాడు. ఈ బౌట్​కు ముందు విజేందర్​ వరుసగా 12 మ్యాచ్​ల్లో గెలిచాడు.

Vijender's unbeaten run ends
విజేందర్​​ విజయాలకు బ్రేక్​

భారత స్టార్​ బాక్సర్​ విజేందర్​ సింగ్​.. ప్రొఫెషనల్​ బాక్సింగ్​లో తొలి ఓటమిని ఎదుర్కొన్నాడు. అంతకుముందు వరుసగా 12 మ్యాచ్​ల్లో గెలిచిన విజేందర్​.. శుక్రవారం రాత్రి జరిగిన బౌట్​లో రష్యా బాక్సర్​ లాప్సన్​ చేతిలో పరాజయం పాలయ్యాడు.

గోవాలోని మెజెస్టిక్​ క్యాసినో నౌకపైభాగంలో ఈ బౌట్​ జరిగింది. సూపర్​ మిడిల్​ వెయిట్​(76 కిలోలు)లో పోటీపడ్డారు. 8 రౌండ్ల గేమ్​లో ఐదో రౌండ్లోనే విజేందర్​ను నాకౌట్​ చేశాడు లాప్సన్​. అతడికి ఇది ఏడో బౌటే కావడం గమనార్హం.

వరుసగా 12..

2008 బీజింగ్​ ఒలింపిక్స్​లో కాంస్యపతకం సాధించిన విజేందర్​.. 2015లో ప్రొఫెషనల్​ బాక్సింగ్​కు మారాడు. వరుసగా 12 విజయాలు నమోదుచేశాడు.

అయితే.. ఈ బౌట్​కు ముందు లాప్సన్​ చిన్న కుర్రాడేనని, అతడ్ని ఓడిస్తానని విశ్వాసం వ్యక్తం చేశాడు విజేందర్​. కానీ ఓడాడు.

ఇదీ చూడండి: 2019 అక్టోబర్​లోనే వుహాన్​లో కరోనా ఆనవాళ్లు!

Last Updated : Mar 20, 2021, 6:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.