భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ అమెరికాకు చెందిన మైక్ స్నైడర్‌ను ఢీ కొట్టనున్నాడు. యూఎస్‌లో తొలి మ్యాచ్ ఆడనున్న విజేందర్ శనివారం మైక్‌తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. 8 రౌండ్లు జరగనున్న ఈ పోటీ భారత్‌లో ఆదివారం ఉదయం నాలుగు గంటలకు ప్రత్యక్ష ప్రసారం కానుంది.
-
Attended press conference of @trboxing ahead of my US debut tomorrow. #SinghvsSnider #VijenderSinghinUSA #13thJuly #Newark #NewJersey pic.twitter.com/siaF84sYQO
— Vijender Singh (@boxervijender) July 12, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Attended press conference of @trboxing ahead of my US debut tomorrow. #SinghvsSnider #VijenderSinghinUSA #13thJuly #Newark #NewJersey pic.twitter.com/siaF84sYQO
— Vijender Singh (@boxervijender) July 12, 2019Attended press conference of @trboxing ahead of my US debut tomorrow. #SinghvsSnider #VijenderSinghinUSA #13thJuly #Newark #NewJersey pic.twitter.com/siaF84sYQO
— Vijender Singh (@boxervijender) July 12, 2019
"ఇది మంచి పోటీ అవుతుందనుకుంటున్నా. ఈ ఏడాది ఇంకో రెండు పోట్లీల్లో పాల్గొంటా. నా ప్రత్యర్థి ఎత్తుగడలపై పూర్తి అవగాహన ఉంది. శనివారం జరగబోయే మ్యాచ్‌లో వ్యూహాలపై మా కోచ్ లీ బియర్డ్‌తో చర్చించా. తొలి రౌండ్లోనే అతడిని నాకౌట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నా" -విజేందర్ సింగ్, భారత బాక్సర్
మైక్ స్నైడర్ కూడా ఈ మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. 21 బౌట్లు ఆడిన స్నైడర్ 13-5-3 రికార్డుతో జోరు మీదున్నాడు. భారత బాక్సర్‌ను ఓడిస్తానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు.
"నేను విజేందర్ సింగ్ ఫైట్లు చూశాను. అతడి బలాలు, బలహీనతలపై స్పష్టమైన అవగాహన ఉంది. నేను గెలవలేను అని అన్నప్పుడల్లా గెలిచి చూపించాను. వారి(ప్రజల) అంచనా తప్పని చూపించడం నాకిష్టం. విజేందర్‌పై తప్పకుండా గెలుస్తా" - మైక్ స్నైడర్, అమెరికా బాక్సర్
ప్రొఫెషనల్ కెరీర్లో 10 బౌట్లు ఆడి అన్నింటిలోనూ విజయం సాధించాడు విజేందర్ సింగ్. ఇందులో ఏడు నాకౌట్లు ఉన్నాయి. దాదాపు ఏడాది విరామం తర్వాత రింగులోకి అడుగుపెట్టనున్నాడు విజేందర్.