పరుగుల రాణి పీటీ ఉషకు అరుదైన గౌరవం లభించింది. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ (ఐఏఏఎఫ్).. ఆమెను ప్రతిష్టాత్మక వెటరన్ పిన్‌తో సత్కరించింది. దోహా వేదికగా జరిగిన 52వ ఐఏఏఎఫ్ సమావేశంలో ఈ అవార్డును సొంతం చేసుకుందీ స్ప్రింటర్. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకుంది. జులైలోనే ఆమెకు ఈ అవార్డు ప్రకటించినా, ఇప్పుడు ప్రదానం చేశారు.
"వెటరన్ పిన్‌తో సత్కరించినందుకు ఐఏఏఎఫ్ అధ్యక్షులు సెబాస్టియన్ కోకుకు ధన్యవాదాలు. ఈ గౌరవంతో దేశంలోని అథ్లెట్ల అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను" -పీటీ ఉష
-
Reminiscing memories with 1984 LA Olympics 400M gold medalist Nawal EL Moutawakel. Missed the bronze by just a hundredth of a second that day. Good to see we both share the same passion for the sport even after all these years!@iaaforg @IAAFDoha2019 pic.twitter.com/X4CKdjAWJI
— P.T. USHA (@PTUshaOfficial) September 25, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Reminiscing memories with 1984 LA Olympics 400M gold medalist Nawal EL Moutawakel. Missed the bronze by just a hundredth of a second that day. Good to see we both share the same passion for the sport even after all these years!@iaaforg @IAAFDoha2019 pic.twitter.com/X4CKdjAWJI
— P.T. USHA (@PTUshaOfficial) September 25, 2019Reminiscing memories with 1984 LA Olympics 400M gold medalist Nawal EL Moutawakel. Missed the bronze by just a hundredth of a second that day. Good to see we both share the same passion for the sport even after all these years!@iaaforg @IAAFDoha2019 pic.twitter.com/X4CKdjAWJI
— P.T. USHA (@PTUshaOfficial) September 25, 2019
1980వ దశకంలో ఆసియాలోనే అత్యుత్తమ అథ్లెట్‌గా పేరు తెచ్చుకుంది ఉష. 1984 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల హర్డిల్స్‌లో సెకనులో వందో వంతు తేడాతో కాంస్య పతకం కోల్పోయింది. 1986 సియోల్ వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో నాలుగు స్వర్ణాలు సహా ఐదు పతకాలు నెగ్గిందీ స్టార్ స్ప్రింటర్. జకార్తా వేదికగా జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్‌లో ఐదు స్వర్ణాలు, కాంస్యంతో సత్తాచాటింది.
ఇదీ చదవండి: వైరల్: పీటీ ఉష టెన్నిస్ అడుతుందటా!