ETV Bharat / sports

యోగాలో పదేళ్ల బాలిక రికార్డు.. గోల్డెన్​ బుక్​లో చోటు

author img

By

Published : Feb 23, 2020, 4:03 PM IST

Updated : Mar 2, 2020, 7:31 AM IST

కర్ణాటకకు చెందిన తనుశ్రీ పిట్రోడి.. గోల్డెన్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. యోగాలో 100 మీటర్ల చక్రాసన విన్యాసాన్ని 40 సెకన్లలో పూర్తి చేసి ఈ ఘనత సాధించింది. గతంలో 1.14 నిమిషాల్లో తన పేరిట ఉన్న రికార్డును తానే తిరగరాసింది.

Tanushree Pithrody
యోగాలో 10 ఏళ్ల బాలిక రికార్డు.. గోల్డెన్​ బుక్​లో చోటు

కర్ణాటకలోని ఉడిపికి చెందిన చిన్నారి తనుశ్రీ.. యోగా పోటీల్లో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఉడిపిలో ఈరోజు.. 100 మీటర్ల చక్రాసన విన్యాసాన్ని కేవలం 40 సెకన్లలోనే పూర్తి చేసింది. గోల్డెన్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల్లో చోటు సంపాదించింది.

ఇదే విభాగంలో హిమాచల్​ ప్రదేశ్‌కు చెందిన సమీక్ష డోగ్రా పేరిట ఉన్న రికార్డును తనుశ్రీ గతంలోనే అధిగమించింది. డోగ్రా.. 100 మీటర్ల చక్రాసన విన్యాసాన్ని 6 నిమిషాల్లో చేయగా.. దాన్ని బ్రేక్​ చేస్తూ, ఈ చిన్నారి 1.14 సెకన్ల సమయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు సరికొత్త రికార్డు సృష్టించింది.

ప్రస్తుతం ఆరో తరగతి చదువుతున్న తనుశ్రీ.. ఇప్పటికే పూర్ణ చక్రాసనం, మోస్ట్‌ ఫుల్‌ బాడీ మెయింటెనింగ్‌ విభాగం, ధనుర్వాసనలో నిమిషంలో ఎక్కువ విన్యాసాలు చేసి ఐదు ప్రపంచ రికార్డులు సాధించింది. 2018లో ఈ చిన్నారి నిమిషంలో 44 రొటేషన్స్​ చేసి గిన్నిస్​ బుక్​లోనూ చోటు దక్కించుకుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : Mar 2, 2020, 7:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.