టోక్యో ఒలింపిక్స్‌కు ముందు అథ్లెట్లు కరోనా బారిన పడటం నిర్వాహకులను కలవరపెడుతోంది. తాజాగా అమెరికాకు చెందిన మహిళా జిమ్నాస్ట్‌కు కొవిడ్ నిర్ధరణ అయింది. ఆమె ప్రి టోక్యో ఒలింపిక్స్ ట్రైనింగ్ క్యాంపులో శిక్షణ తీసుకుంది. వైరస్ బారిన పడటం వల్ల ప్రస్తుతం ఐసోలేషన్లోకి వెళ్లింది. ఈ
అంతకుముందు చెక్ రిపబ్లిక్ బీచ్ వాలీబాల్ ప్లేయర్ ఒండ్రెజ్ పెరుసిక్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆమెకు కూడా ఐసోలేషన్లోకి వెళ్లింది. చెక్ రిపబ్లిక్కు సంబంధించి ఇది ఒలింపిక్స్‌లో రెండో కేసు.
ఇక ఆదివారం రాత్రి గ్రేట్ బ్రిటన్‌కు చెందిన 8 మంది అథ్లెట్లు ఐసోలేషన్లోకి వెళ్లారు. ఫ్లైట్‌లో వస్తున్న సమయంలో కొవిడ్ సోకిన వ్యక్తితో వీరు సన్నిహితంగా మెలగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. వీరంతా టోక్యోకు బయలుదేరడానికి ముందు నెగెటివ్ రిపోర్ట్‌తో ఉన్నారు.
ఐఓసీ శరణార్థుల జట్టు చీఫ్‌కు కరోనా:
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) శరణార్థుల జట్టు చెఫ్ డి మిషన్, మాజీ అథ్లెట్ లోరౌప్ పాజిటివ్‌గా తేలింది. దోహా నుంచి టోక్యోకు బయల్దేరే ముందు ఆమెకు పాజిటివ్ వచ్చింది. దీంతో శరణార్థుల జట్టు టోక్యో రాక ఆలస్యం కానుంది. ఒకటి, రెండు రోజుల్లో శరణార్థుల జట్టు ఒలింపిక్స్‌కు రావొచ్చని.. లోరౌప్ మాత్రం దోహాలోనే క్వారంటైన్‌లో ఉండనుందని ఐసీఓ వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: Olympics: ఒలింపిక్స్‌కు దూరమైన టెన్నిస్ యువ సంచలనం