టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనే క్రీడాకారులకు తమిళనాడు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. పతకాలు సాధించిన వారికి రివార్డు అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం వెల్లడించారు.
బంగారు పతక విజేతలకు.. రూ.3 కోట్లు, వెండి గెలుచుకున్న వారికి రూ.2 కోట్లు, కాంస్యానికి రూ.1కోటి చొప్పున ఇవ్వనున్నట్లు స్టాలిన్ ప్రకటించారు. 2012 లండన్ ఒలింపిక్స్లో కాంస్యం సాధించిన గగన నారంగ్.. తమిళనాడు నుంచి ఒలింపిక్ పతకం గెలుచుకున్న ఏకైక అథ్లెట్.
అంతకుముందు అంతర్జాతీయ ఒలింపిక్స్ దినోత్సవం(జూన్ 23) సందర్భంగా హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కూడా విజేతలకు క్రీడా విభాగంలో ఉద్యోగాలు ఇస్తామని ప్రకటన చేశారు. దీంతో కొత్త ఆటగాళ్లను ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు.
ఇదీ చూడండి: ఒలింపిక్స్లో ఆ రూల్.. కండోమ్ తయారీదారుల నిరాశ