ETV Bharat / sports

OLYMPICS: ఒలింపిక్స్ పతకాలు.. రీసైక్లింగ్​ చేసిన ఆ వస్తువులతో

author img

By

Published : Jul 2, 2021, 6:56 PM IST

ఈసారి ఒలింపిక్స్​లో విజేతల మెడలో పతకాలు మిలమిల మెరుస్తాయి. కానీ ఎప్పుడూ చేసే ముడి పదర్థాలతో కాకుండా రీసైక్లింగ్ చేసిన ఎలక్ట్రానిక్ వస్తువులతో తయారుచేశారు. ఇంతకీ ఆ వస్తువులేంటి? వాటి కథేంటి?

Tokyo Olympics
టోక్యో ఒలింపిక్స్

మెగా క్రీడలు ఒలింపిక్స్(Olympics)​ ప్రారంభానికి మరో 21 రోజులు మాత్రమే ఉంది. ఓ వైపు కరోనా(Corona) ప్రభావం ఉన్నప్పటికీ, పోటీలు నిర్వహిస్తామని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(IOC) చెబుతోంది. ఆ విషయాలన్ని పక్కనపెడితే టోక్యో ఒలింపిక్స్​లో ఇవ్వబోయే పతకాలకు సంబంధించిన వార్త ఆసక్తి రేకెత్తిస్తోంది. వాటిని రీసైక్లింగ్​ చేసిన పనికిరాని ల్యాప్​టాప్స్, స్మార్ట్​ఫోన్లతో తయారు చేశారని టోక్యో ఇండియా ట్వీట్ చేసింది.

Tokyo Olympics
ఒలింపిక్స్ మెడల్

ఒలింపిక్స్​ ప్రారంభానికి రెండు వారాల ముందు అంటే జులై 8న జపాన్​కు ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ రానున్నారు. అథ్లెట్లలానే రెండు డోసు వ్యాక్సిన్​ ఆయన తీసుకున్నారు. ఈ క్రీడలు గైడ్​లైన్స్​లో ఉన్నట్లే సురక్షిత, భద్రమైన వాతావరణంలోనే జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.

అనంతరం జులై 17, 18 తేదీల్లో ఐఓసీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరగనుంది. ఆ తర్వాత జులై 20న 138వ ఐఓసీ సెషన్​ నిర్వహించనున్నారు. జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్​ నిర్వహించనున్నారు. గతేడాది ఈ పోటీలు జరగాల్సినప్పటికీ, కరోనా ప్రభావం వల్ల సంవత్సరం పాటు వాయిదా వేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.