టోక్యో ఒలింపిక్స్లో(Tokyo Olympics) బంగారు పతకం సాధించే అథ్లెట్ల కోసం భారీ నజరానా ప్రకటించింది ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(IOA). విశ్వక్రీడల్లో విజేతగా నిలిచిన ప్రతి ఒక్క అథ్లెట్కు రూ.75 లక్షలు బహుమానంగా ఇవ్వనున్నట్లు ఐఓఏ వెల్లడించింది. అథ్లెట్లు ప్రాతినిధ్యం వహించిన జాతీయ క్రీడా సమాఖ్యలు రూ.25 లక్షలు అదనంగా పొందే అవకాశం ఉంది.
పసిడి పతకాల విజేతలతో పాటు సిల్వర్ మెడల్ గెలిచిన క్రీడాకారులకు రూ.40 లక్షలు, కాంస్య పతక విజేతలకు రూ.25 లక్షలు ఇవ్వనున్నట్లు ఐఓఏ సలహా కమిటీ పేర్కొంది. దేశం తరఫున టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనే ప్రతి అథ్లెట్కు లక్ష రూపాయలు ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
ఇదీ చూడండి.. Tokyo Olympics: ఈసారి పతకం 'గురి' తప్పదు!