టోక్యో ఒలింపిక్స్‌కు(Tokyo Olympics) అర్హత సాధించడంపై భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతి చంద్(Dutee chand) హర్షం వ్యక్తం చేసింది. మెగాక్రీడల్లో అద్భుత ప్రదర్శన చేసి సెమీఫైనల్స్‌కు చేరుకోవడమే తన లక్ష్యమని తెలిపింది. ఇందుకోసం రోజుకు ఆరు నుంచి ఏడు గంటలు ప్రాక్టీస్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఘనత సాధించడంపై తన శిక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. ఒలింపిక్స్‌లో విజయం సాధిస్తే ఆ ఘనతంతా సాయ్, కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజుకు చెందుతుందని చెప్పింది.
ప్రపంచ ర్యాంకింగ్స్ కోటాలో 100 మీ, 200 మీటర్ల విభాగంలో ప్రపంచ ర్యాంకింగ్స్ కోటాలో బెర్త్ ఖాయం చేసుకుంది ద్యుతి. ఒలింపిక్స్‌లో 100 మీ. పోటీల్లో 22 ఖాళీలు ఉండగా, 200 మీ. పరుగు పందెంలో 15 ఖాళీలు ఉన్నాయి. 100 మీ. విభాగంలో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 44వ స్థానంలో ఉన్న ద్యుతీ.. 200 మీ. విభాగంలో 51వ స్థానంలో నిలిచింది.
ఇదీ చూడండి: Olympics: స్ప్రింటర్ ద్యుతీ చంద్‌కు ఒలింపిక్స్ బెర్త్