ETV Bharat / sports

Swiss Open: క్వార్టర్​ ఫైనల్స్​కు కిదాంబి శ్రీకాంత్​, కశ్యప్​.. - పీవీ సింధు

Swiss Open: స్విస్​ ఓపెన్​ పురుషుల సింగిల్స్​లో భారత షట్లర్లు కిదాంబి శ్రీకాంత్​, పారుపల్లి కశ్యప్​ క్వార్టర్​ ఫైనల్స్​కు చేరుకున్నారు. పురుషుల డబుల్స్​లో ఇండోనేసియా జోడీ చేతిలో సాత్విక్ సాయిరాజ్​​-చిరాగ్​శెట్టి జోడీ ఓటమి పాలైంది.

srikanth
swiss open
author img

By

Published : Mar 24, 2022, 9:52 PM IST

Swiss Open: ప్రపంచ ఛాంపియన్​షిప్​ రజత పతక విజేత కిదాంబి శ్రీకాంత్​ స్విస్​ ఓపెన్​ క్వార్టర్​ పైనల్స్​కు అర్హత సాధించాడు. ఫ్రాన్స్ క్రీడాకారుడు క్రిస్టో పొపొవ్​పై 13-21, 25-23, 21-11 తేడాతో విజయం సాధించాడు. శ్రీకాంత్​ తన తర్వాత మ్యాచ్​లో డేన్​ అండర్స్​ అంటోన్స్​సెన్​తో తలపడనున్నాడు. ఒలింపిక్​ ఛాంపియన్​ అక్సెల్​సేన్​ వాకోవర్​ ఇవ్వడం వల్ల మరో భారత్​ షట్లర్​ పారుపల్లి కశ్యప్​ కూడా క్వార్టర్​ ఫైనల్​కు దూసుకెళ్లాడు.

పురుషుల డబుల్స్​లో సాత్విక్​ సాయిరాజ్​- చిరాగ్​ శెట్టి జోడీ.. ఇండోనేసియాకు చెందిన ప్రముద్య కుసుమవర్ధన-ఈరిచ్​ యోచీ చేతిలో 19-21, 20-22 తేడాతో ఓడిపోయింది. మహిళల సింగిల్స్‌లో అష్మితా చలిహా 18-21 20-22 తేడాతో ఎనిమిదో సీడ్ స్కాట్ కిర్స్టీ గిల్మర్‌ చేతిలో రెండో రౌండ్‌లో ఓడిపోయింది. కాగా, బుధవారం జరిగిన మహిళల సింగిల్స్​లో భారత స్టార్​ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్​ రెండో రౌండ్​కు చేరుకున్నారు. మహిళల డబుల్స్​లో అశ్విని పొన్నప్ప, సిక్కిరెడ్డి జంట కూడా తొలి రౌండ్​లో విజయం సాధించింది.

ఇదీ చదవండి: IPL 2022: కెప్టెన్​గా ఎంపికవ్వడంపై జడ్డూ ఏమన్నాడంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.