ETV Bharat / sports

'ఇప్పటికీ సుశీల్​ కుమారే ఉత్తమ రెజ్లర్'​

సుశీల్ కుమార్​(sushil kumar) కంటే ఎవరినీ ఉత్తమ రెజర్ల్​గా పరిగణించలేనని వ్యాఖ్యానించాడు టోక్యో ఒలింపిక్స్​ పతక విజేత బజ్​రంగ్​ పూనియా. సుశీల్​.. రెజ్లింగ్​కు గొప్ప వైభవం తీసుకొచ్చాడని ప్రశంసించాడు.

wrestler Sushil Kumar
రెజ్లర్​ సుశీల్​ కుమార్​
author img

By

Published : Aug 27, 2021, 7:56 PM IST

మల్లయోధుడు సాగర్​ రానా హత్య కేసు ప్రధాన నిందితుడు రెజ్లర్​ సుశీల్ కుమార్​పై(sushil kumar) ప్రశంసలు కురిపించాడు మరో రెజ్లర్​ బజ్​రంగ్ పూనియా. సుశీల్​ 56 ఏళ్ల నిరీక్షణకు తెరదించి.. రెజ్లింగ్​కు గొప్ప కళను తీసుకొచ్చాడని కొనియాడాడు. దిల్లీలో సీఐఎస్ఎఫ్​ నిర్వహించిన సత్కార సభలో ఈ వ్యాఖ్యలు చేశాడు పూనియా. ఇటీవల జరిగిన టోక్యో ఒలింపిక్స్​లో కాంస్య పతకం సాధించాడీ రెజ్లర్.

"సుశీల్ కుమార్​ కంటే ఎవరినీ ఉత్తమ రెజర్ల్​గా పరిగణించలేను. 2008 బీజింగ్​ ఒలింపిక్స్​లో పతకం అందించి.. రెజ్లింగ్​కు వైభవం తీసుకొచ్చాడు. రెజ్లింగ్​ విభాగంలో కాంస్య పతకం సొంతం చేసుకుని 56ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు."

- రెజ్లర్​ బజ్​రంగ్ పూనియా

హత్య కేసులో నిందితుడిగా ఉన్న సుశీల్​ గురించి ప్రశ్నించగా.. దానిని తోసిపుచ్చాడు బజ్​రంగ్. కేవలం అతని క్రీడా జీవితం గురించే మాట్లాతున్నానని వివరణ ఇచ్చాడు.

అనంతరం "టోక్యో ఒలింపిక్స్​లో ఉత్తమ ప్రదర్శన చేశాను. సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతూ.. 2024లో (ఒలింపిక్స్) స్వర్ణ పతకాన్ని గెలవడానికి ప్రయత్నిస్తాను. అందుకు మరింత కష్టపడాల్సి ఉంది" అని చెప్పుకొచ్చాడు పూనియా.

భవిష్యత్​లో భారత్​ క్రీడల్లో మరింత మెరుగుపడాలంటే.. తల్లిదండ్రులు పిల్లలని ప్రోత్సహించాలని.. వారే తొలి గురవులని పేర్కొన్నాడు. అలాగే క్రీడలకు తగిన అన్ని సౌకర్యాలను, మంచి ఆహారాన్ని వారికి అందించాలన్నాడు.

ఇదీ చూడండి: Neeraj Chopra: 'ఈ ఏడాదికి ముగింపు పలుకుతున్నా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.