ETV Bharat / sports

ప్రపంచకప్​పై కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన - మహిళల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌

Supreme court Fifa world cup ఫిఫాతో చర్చలు జరిపి అండర్‌-17 మహిళల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ను దేశం దాటి వెళ్లకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది. ఆ వివరాలు

Supreme court Fifa world cup
ప్రపంచకప్​పై కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
author img

By

Published : Aug 18, 2022, 11:24 AM IST

Updated : Oct 29, 2022, 3:52 PM IST

Supreme court Fifa world cup ఫిఫాతో చర్చలు జరిపి అండర్‌-17 మహిళల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ను దేశం దాటి వెళ్లకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది. బయట వర్గం ప్రభావం కారణంగా అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌)పై ఫిఫా నిషేధం విధించింది. ఈ ఏడాది అక్టోబర్‌ 11 నుంచి 30 వరకు స్వదేశంలో జరగాల్సిన అండర్‌-17 మహిళల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ను ప్రస్తుతానికి భారత్‌లో నిర్వహించాలనుకోవడం లేదని కూడా ఫిఫా స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో ఏఐఎఫ్‌ఎఫ్‌కు సంబంధించిన కేసులను వెంటనే విచారించాలని సుప్రీం కోర్టును కేంద్రం కోరింది. ఈ మేరకు జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ జేబీ పరిద్వాలాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారణ మొదలెట్టింది. ప్రపంచకప్‌ను స్వదేశంలోనే నిర్వహించేలా ఫిఫాతో ప్రభుత్వం, కోర్టు నియమించిన పాలకుల కమిటీ (సీఓఏ) చర్చలు జరుపుతుందని, ఈ విచారణను ఈ నెల 22 వరకు వాయిదా వేయాలని ధర్మాసనాన్ని కేంద్రం కోరింది. ఈ సమస్యకు పరిష్కారం కోసం ఈ రెండు వర్గాల మధ్య ఇప్పటికే రెండు సమావేశాలు జరిగాయని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు తెలిపారు. దీంతో అండర్‌-17 యువతకు ఈ ప్రపంచకప్‌ గొప్ప అంతర్జాతీయ టోర్నీగా మిగిలిపోనుందని పేర్కొన్న ధర్మాసనం విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. స్వదేశంలో ఈ టోర్నీ నిర్వహణతో పాటు ఏఐఎఫ్‌ఎఫ్‌పై నిషేధం తొలగించేలా కేంద్రం అవసరమైన చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. సమాఖ్యలో బయట వర్గం జోక్యాన్ని ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పింది. ఈ పరిణామాలన్నింటికీ ఏఐఎఫ్‌ఎఫ్‌ మాజీ అధ్యక్షుడు ప్రఫుల్‌ పటేల్‌ కారణమని సీనియర్‌ న్యాయవాది రాహుల్‌ మెహ్రా కోర్టుకు తెలిపారు.

ఇదీ చూడండి: భారత ఫుట్‌బాల్‌పై పెద్ద బాంబు, ప్రపంచకప్‌ ఆతిథ్యానికి దూరం

Last Updated : Oct 29, 2022, 3:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.