క్రీడాకారులను స్వచ్ఛంగా ఉంచేందుకు జాతీయ డోపింగ్ నిరోధక వ్యవస్థ ప్రచారకర్తను నియమించింది. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి నాడా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌కు ఎక్కువ సమయం లేకపోవడంతో సునీల్ శెట్టి ఇమేజ్‌ను ఉపయోగించుకోవాలని నాడా భావిస్తోంది.
"అథ్లెట్, మాజీ అథ్లెట్‌కన్నా ఓ నటుడు దేశవ్యాప్తంగా మరింత ఎక్కువ ప్రభావం చూపగలడు. అందుకే క్రీడల్లో డోపింగ్‌ను దూరం చేసే చర్యల్లో భాగంగా సునీల్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేశాం. అంతేకాకుండా తాజా అథ్లెట్లు వివిధ టోర్నీల్లో బిజీగా ఉండడంతో ప్రచారానికి తగిన సమయం కేటాయించలేరు" -నాడా
ఈ ఏడాది 150 మందికి పైగా అథ్లెట్లు డోపింగ్‌లో దొరికిపోయిన సంగతి తెలిసిందే. అందులో బాడీబిల్డర్లు 1/3 వంతు ఉన్నారు. ఈ ఏడాది జాతీయ డోపింగ్ నిరోధక లేబొరేటరీపై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) సస్పెన్షన్ విధించింది. ఈ కారణంగా అథ్లెట్ల డోప్ నమూనాలను నాడా భారత్ వెలుపల పరీక్షిస్తోంది.
ఇదీ చదవండి: వైరల్: చాహల్, కుల్దీప్కు రోహిత్ ర్యాపిడ్ ఫైర్