ఒలింపిక్స్ క్రీడా మహోత్సవం ప్రారంభమైంది. కానీ.. ప్రతిసారి అంగరంగ వైభవంగా జరిగే ఒలింపిక్స్ ప్రారంభ వేడుక.. కరోనా మహమ్మారి కారణంగా ఈసారి సాదాసీదాగా జరగనుంది. గతేడాదే నిర్వహించాల్సిన ఒలింపిక్స్ క్రీడలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. మహమ్మారి వ్యాప్తితో అసలు ఈ క్రీడలు జరుగుతాయా? అనే సందేహాలు కలిగాయి. జపాన్ ప్రజలే ఒలింపిక్స్‌ను నిర్వహించొద్దని వ్యతిరేకించారు. అయినా.. కరోనా నిబంధనలు పాటిస్తూ ఒలింపిక్స్‌ను జరిపేందుకు ఆ దేశం ముందుకొచ్చింది. ఈ క్రమంలోనే ఒలింపిక్స్‌లో భాగమైన ప్రారంభోత్సవాన్ని మామూలుగా నిర్వహించనుంది. అయితే, గత ఒలింపిక్స్ క్రీడల్లో జరిగిన కొన్ని గొప్ప ప్రారంభోత్సవాలు, విశేషాలపై ఓ లుక్కేద్దాం..!
టోక్యో ఒలింపిక్స్- 1964..
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ప్రస్తుతం ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తున్న జపాన్.. 1964లోనూ ఈ మెగా క్రీడలను నిర్వహించింది. ఆసియాలో ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చిన తొలిదేశం కూడా జపానే. క్రీడలను శాటిలైట్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడం కూడా టోక్యో ఒలింపిక్స్ నుంచే ప్రారంభమైంది. ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో భాగంగా వేలకొద్ది బెలూన్లను, 8వేల పావురాలను గాల్లోకి ఎగరవేశారు. ఐదు జెట్ రాకెట్లు గాల్లో గింగిరాలు తిరుగుతూ ఒలింపిక్స్ రింగులను గీయడం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మరో విశేషమేమిటంటే.. ప్రారంభోత్సవంలో ఒలింపిక్ జ్యోతిని హిరోషిమా బేబీగా గుర్తింపు పొందిన యోషినోరి సకాయ్ వెలిగించాడు. హిరోషిమాపై అణుబాంబు పడిన రోజునే యోషినోరి జన్మించాడు. అందుకే అతడిని హిరోషిమా బేబి అని పిలుస్తుంటారు.
మాస్కో ఒలింపిక్స్- 1980..
- " class="align-text-top noRightClick twitterSection" data="">
1980లో రష్యా-అమెరికా మధ్య కోల్డ్‌వార్ జరుగుతుండటం వల్ల మాస్కోలో జరిగిన ఒలింపిక్స్‌ను అమెరికా నిషేధించింది. ఈ నేపథ్యంలో అమెరికాకు కన్నుకుట్టే విధంగా ఒలింపిక్స్ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది రష్యా. మైదానం మధ్యలో కొందరు పిరమిడ్ ఆకారంలో ఒకరిపై ఒకరు నిల్చోడం అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే, స్టేడియం కార్డులను పరిచయం చేసిన ఘనత రష్యాకే చెందుతుంది. మైదానంలో ఒలింపిక్ జ్యోతిని వెలిగించిన వెంటనే అక్కడ ఉన్న ప్రేక్షకులంతా కలిసి కార్డులతో నినాదాలు.. ఒలింపిక్స్ రింగులను ప్రదర్శించడం వేడుకలో హైలైట్‌గా నిలిచింది.
లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్- 1984..
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అగ్రరాజ్యం అమెరికా 1984లో ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చింది. లాస్ ఏంజెలెస్ మెమోరియల్ కోలిజియం వేదికగా ప్రారంభోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా 800 మంది మ్యూజిషియన్లు సంగీతం వాయిస్తూ క్రీడాకారులతో పాటు మార్చ్ చేశారు. 410 మంది బ్యాలెట్ డాన్స్ చేశారు. మ్యూజిషియన్లు 84 అతిపెద్ద పియానోలను వాయించారు. 300 మంది గాయకులు కలిసి పాట పాడారు. ఈ వేడుకలో ఓ వ్యక్తి జెట్ ప్యాకెట్ వేసుకొని గాల్లో ఎగురుతూ వచ్చి మైదానం మధ్యలో ల్యాండ్ కావడం ప్రారంభోత్సవంలో మరుపురాని ఘట్టంగా చెబుతుంటారు.
ఇదీ చదవండి: పరుగు మధ్యలో గాయం- ట్రాక్‌లోకి దిగిన తండ్రి!
బార్సిలోనా ఒలింపిక్స్- 1992..
- " class="align-text-top noRightClick twitterSection" data="">
స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరిగిన ఒలింపిక్స్ ప్రారంభోత్సవం ఎంతో వైవిధ్యంగా నిర్వహించారనడంలో సందేహం లేదు. 67వేల మంది ప్రేక్షకుల మధ్య భారీ పప్పెట్స్(తోలుబొమ్మలు) సందడి చేశాయి. వందలాది కళాకారులు నీలి రంగు దుస్తులు వేసుకొని స్టేడియాన్ని సముద్రంగా మార్చగా.. అందులో భారీ ఓడను నడుపుతున్నట్లు చేసిన విన్యాసం అబ్బురపర్చింది. వేడుక చివర్లో పారాఒలింపిక్ ఆర్చర్ ఆంటోనియో రొబెల్లో బాణం ఎక్కుపెట్టి ఒలింపిక్ జ్యోతిని వెలిగించడం విశేషం.
సిడ్నీ ఒలింపిక్స్- 2000..
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సిడ్నీ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో కళాకారులు మంటలతో భారీ ప్రదర్శన ఇచ్చారు. ప్రేక్షకులంతా చేతికి ఎరుపు రంగు టార్చ్ బ్యాండ్‌తో స్టేడియమంతా వెలుగులు నింపారు. ఆ తర్వాత రంగురంగు సీతాకోకచిలుకల వేషధారణతో మరికొంత మంది చేసిన నృత్యప్రదర్శన కనులవిందుగా సాగింది. దేశాల వారీగా అథ్లెట్ల మార్చ్, ప్రారంభోత్సవ ప్రసంగం తర్వాత ఒలింపిక్స్ జ్యోతి వెలిగించే సమయంలో నీరు.. నిప్పుతో చేసిన విన్యాసం ప్రేక్షకులను కట్టిపడేసింది.
ఏథెన్స్ ఒలింపిక్స్- 2004..
- " class="align-text-top noRightClick twitterSection" data="">
గ్రీస్‌లోని ఏథెన్స్‌లో ఒలింపిక్స్-2004 ప్రారంభోత్సవం జరిగింది. గ్రీస్ అంటేనే అత్యంత ప్రాచీన చరిత్ర కలిగిన నగరం. అందుకే ఆ దేశ చరిత్ర, అక్కడి ప్రజల సంస్కృతిని తెలిపే విధంగా పలు ప్రదర్శనలు ఇచ్చారు. ఆ తర్వాత అథ్లెట్ల మార్చ్.. ప్రారంభోత్సవ ప్రసంగం.. ఒలింపిక్స్ జ్యోతి ప్రజ్వలన జరిగాయి.
ఇదీ చదవండి: ఒక్క ఒలింపిక్స్‌లో 32 ప్రపంచ రికార్డులు..
బీజింగ్ ఒలింపిక్స్- 2008..
- " class="align-text-top noRightClick twitterSection" data="">
చైనాలోని జీబింగ్ నేషనల్ స్టేడియంలో నిర్వహించిన ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో కనివినీ ఎరుగని విధంగా 2008 మంది డ్రమ్మర్స్ స్టేడియంలో డ్రమ్స్ వాయిస్తూ.. పాట పాడారు. ఆ దృశ్యం.. డ్రమ్స్ శబ్దాలు ప్రేక్షకుల్లో రోమాలు నిక్కపోడిచాయంటే అతిశయోక్తి కాదు. ఆ తర్వాత అరవై అడుగుల ఎత్తులో రూపొందించిన గోళాకారపు వస్తువు చుట్టూ రోపుల సాయంతో కళాకారులు విన్యాసాలు చేశారు. చివర్లో ఒలింపిక్స్ జ్యోతి ఓ వ్యక్తి గాల్లో ఎగురుతూ(రోప్ సాయంతో) వచ్చి వెలిగించడం ఆకట్టుకుంటుంది.
లండన్ ఒలింపిక్స్- 2012..
- " class="align-text-top noRightClick twitterSection" data="">
లండన్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో బ్రిటన్ పారిశ్రామిక విప్లవం నుంచి చరిత్రలో నిలిచిపోయిన అనేక ఘట్టాలను ప్రదర్శించారు. లండన్ సింఫనీ ఆర్కేస్ట్రా బృందం సంగీత కచేరీ చేస్తుండగా.. మిస్టర్ బీన్(రోవన్ అట్కిన్సన్) వచ్చి చేసిన సందడి ఆద్యంతం నవ్వులు పూయించింది. క్రీడల నేపథ్యంలోనే మిస్టర్ బీన్ నటించిన హాస్యభరిత లఘుచిత్రాన్ని ప్రదర్శించారు. జేమ్స్‌బాండ్ పాత్రధారి డానియల్ క్రెగ్‌తో కలిసి బ్రిటన్ రాణి ఎలిజెబెత్ హెలికాప్టర్‌లో వచ్చి స్టేడియంలో స్కైడైవింగ్ చేస్తూ దిగడం విశేషం.(నిజానికి ఆమె అసలైన ఎలిజెబెత్ కాదు. ఆమె పాత్రలో మరో వ్యక్తి నటించారు). ఆ తర్వాత అసలైన ఎలిజెబెత్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ ప్రదర్శనలకు స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్ర దర్శకుడు డ్యానీ బోయల్ దర్శకత్వం వహించారు.
రియో ఒలింపిక్స్- 2016..
- " class="align-text-top noRightClick twitterSection" data="">
రియోలోని మారకానా స్టేడియంలో ఒలింపిక్స్ ప్రారంభోత్సవాలు జరిగాయి. దేశ ఆర్థిక పరిస్థితుల, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో తక్కువ ఖర్చుతో.. ఉన్నంతలో గొప్పగా నిర్వహించాలని వేడుక నిర్వహకులు భావించారు. ఈ క్రమంలో అమెజాన్ అడవులు.. గిరిజన సంప్రదాయాలు ఉట్టిపడేలా నృత్య ప్రదర్శనలు, గాయకుల సంగీత కచేరీలు జరిగాయి. బ్రెజిల్‌లో ప్రముఖ మోడల్ గిసెలె బుడ్చెన్.. స్థానిక గాయకుడు డానియల్ జోబిమ్ పాట పాడుతుండగా ర్యాంప్ వాక్ చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే, ప్రారంభోత్సవ కార్యక్రమం ముగింపులో ఒలింపిక్స్ జ్యోతి ప్రజ్వలన మాత్రం ఒక్కో ఆతిథ్య దేశం విభిన్నంగా ఏర్పాటు చేసి ప్రత్యేకతను చాటుకున్నాయి.
ఇదీ చదవండి: ఒలింపిక్స్‌ను ఊపేసే ఆ 'బోల్ట్' వారసులు ఎవరు?