ETV Bharat / sports

స్టేడియం బయట తొక్కిసలాట- ఆరుగురు మృతి

Stampede At Soccer Stadium: ఓ ఫుట్​బాల్ స్టేడియం బయట తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. అనేకమంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు అధికారులు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.

stampede at soccer stadium
స్టేడియంలో తొక్కిసలాట
author img

By

Published : Jan 25, 2022, 9:28 AM IST

Stampede At Soccer Stadium: 'ఆఫ్రికన్​ కప్​'లో భాగంగా.. సెంట్రల్​ ఆఫ్రికా దేశం కామెరూన్​లో నిర్వహించిన సాకర్​ పోటీల్లో విషాదం జరిగింది. స్టేడియం బయట తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతిచెందారు. అనేక మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు అధికారులు.

ఆతిథ్య జట్టు ఆటను చూసేందుకు పరిమితికి మించి ప్రేక్షకులు వచ్చారు. దీంతో అధికారులు స్టేడియం గేట్లు మూసివేశారు. ఈ క్రమంలో బయట తొక్కిసలాట జరిగినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కామెరూన్​ గవర్నర్ నసేరి పౌల్​ బియా అభిప్రాయపడ్డారు.

కామెరూన్ రాజధాని యోండేలోని ఓలెంబ్ స్టేడియంకు భారీగా ప్రేక్షకులు వచ్చారు. కొవిడ్ ఆంక్షలు ఉన్నా దాదాపు 50వేల మంది వచ్చినట్లు అధికారులు తెలిపారు.

కామరూన్​లో 'ఆఫ్రికన్ కప్​'ను నిర్వహించడం 50 ఏళ్లలో ఇదే తొలిసారి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: Australian Open: 63వ గ్రాండ్​స్లామ్​లో నెరవేరిన కల.. క్వార్టర్స్‌లో కార్నెట్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.