ETV Bharat / sports

సెయింట్ లూయిస్ చెస్ టోర్నీలో అగ్రస్థానంలో హరికృష్ణ

తెలుగు గ్రాండ్ మాస్టర్ పెంటేల హరికృష్ణ సెయింట్ లూయిస్ ఆన్​లైన్ చెస్ టోర్నీలో సత్తాచాటుతున్నాడు. మూడు రౌండ్లు పూర్తయ్యే సరికి అయిదు పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

St Louis Rapid chess: Harikrishna in joint lead after 3 rounds
సెయింట్ లూయిస్ చెస్ టోర్నీలో అగ్రస్థానంలో హరికృష్ణ
author img

By

Published : Sep 17, 2020, 6:41 AM IST

సెయింట్‌ లూయిస్‌ ఆన్‌లైన్‌ చెస్‌ టోర్నీలో తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ జోరు ప్రదర్శిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా పదిమంది అగ్రశ్రేణి ఆటగాళ్లు తలపడుతోన్న ఈ టోర్నీ ర్యాపిడ్‌ విభాగంలో మూడు రౌండ్లు పూర్తయేసరికి అయిదు పాయింట్లు సాధించిన అతను అరోనియన్‌ (అర్మేనియా)తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

తొలి రౌండ్లో అమెరికా గ్రాండ్‌మాస్టర్‌ లీనియర్‌పై గెలిచిన అతను.. రెండో రౌండ్లో అలీరెజా (ఇరాన్‌)తో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. మూడో రౌండ్లో అలెగ్జాండర్‌ (రష్యా)ను 41 ఎత్తుల్లో చిత్తుచేశాడు. ప్రపంచ ఛాంపియన్‌ కార్ల్‌సన్‌ మూడు పాయింట్లతో అయిదో స్థానంలో ఉన్నాడు. రెండో రౌండ్లో నెపోమియాచి చేతిలో ఓడిన అతను.. మూడో రౌండ్లో వెస్లీతో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.