ETV Bharat / sports

Olympics: భారత అథ్లెట్ల కోసం స్పెషల్​ సాంగ్​ - at Tokyo ceremonies

టోక్యో ఒలింపిక్స్​కు(Tokyo Olympics) వెళ్లే భారత అథ్లెట్ల కోసం ప్రత్యేక గీతం విడుదలైంది. మరోవైపు పతకాల ప్రదానోత్సవ విషయమై స్వల్ప మార్పులు జరిగాయి. ఇంతకీ మార్పులేంటి? దాని సంగతేంటి?

Olympics
టోక్యో ఒలింపిక్స్​
author img

By

Published : Jul 14, 2021, 6:03 PM IST

టోక్యో ఒలింపిక్స్​లో(Tokyo Olympics)​ పాల్గొననున్న భారత అథ్లెట్లలో ఉత్సాహాన్ని నింపేందుకు ఓ ప్రత్యేక పాటను రూపొందించారు. 'చీర్​ ఫర్​ ఇండియా' పేరుతో ఈ గీతాన్ని.. కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్​ ఠాకూర్ బుధవారం(జులై 14) విడుదల చేశారు. క్రీడాకారులకు మద్దతుగా నిలవాలని దేశ ప్రజలకు కోరారు. ప్రతిఒక్కరూ ఈ పాట వినాలని అన్నారు. యువ గాయని అనన్యా బిర్లా ఈ గీతాన్ని ఆలపించగా గ్రామీ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్​ రెహ్మాన్​ స్వరాలు సమకూర్చారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

పతకాల ప్రదానోత్సవంలో మార్పులు

ఒలింపిక్స్(Tokyo Olympics)​ విజేతలకు అందించే పతకాల ప్రదానోత్సవంలో మార్పులు చేశారు నిర్వాహకులు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఈ వేడుకను నిర్వహించనున్నారు. సాధారణంగా గెలుపొందిన అథ్లెట్లకు మెడల్స్​ను వారి మెడలో వేసి సత్కరిస్తారు. అయితే ఈ సారి కరోనా కారణంగా పతకాలను ఓ ట్రేలో తీసుకురాగా, క్రీడాకారులు స్వయంగా తమ పతకాలను మెడలో వేసుకునేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్​ బాచ్​ వెల్లడించారు. కరచాలనం, ఆలింగనం వంటివి కూడా ఉండవని స్పష్టం చేశారు.

మొత్తం 119 మంది

ఈ మెగాక్రీడలకు భారత్‌ నుంచి 228 మందితో కూడిన బృందం వెళ్లనుంది. అందులో 119 మంది అథ్లెట్లు ఉన్నారు. వీరిలో 67 మంది పురుషులు, 52 మంది మహిళలు. మొత్తం 85 విభాగాల్లో వీరంతా పోటీపడుతున్నారు. ఈనెల 17న 90 మంది క్రీడాకారులు, ఆయా విభాగాల అధికారులు ప్రత్యేక విమానంలో టోక్యోకు బయలుదేరనున్నారు.

ఇదీ చూడండి: ప్చ్.. ఒలింపిక్స్​లో ఈ స్టార్ ప్లేయర్స్​ను చూడలేం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.