ETV Bharat / sports

స్నేహిత్‌ సంచలనం.. సీనియర్‌ టీటీలో పతకం ఖాయం - సెమీస్​లో స్నేహిత్

జాతీయ సీనియర్​ టేబుల్​ టెన్నిస్​ ఛాంపియన్​షిప్​లో తెలుగు కుర్రాడు ఎస్​ఎఫ్​ఆర్​ స్నేహిత్​ మెరిశాడు. పురుషుల సింగిల్స్​ క్వార్టర్స్​లో సుష్మిత్​ శ్రీరాంపై నెగ్గి, సెమీస్​కు చేరిన స్నేహిత్​.. దాదాపుగా పతకాన్ని ఖాయం చేసుకున్నాడు.

Snehit hogs the limelight, storms into semifinals
స్నేహిత్‌ సంచలనం.. సీనియర్‌ టీటీలో పతకం ఖాయం
author img

By

Published : Feb 23, 2021, 8:00 AM IST

జాతీయ సీనియర్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ కుర్రాడు ఎస్‌ఎఫ్‌ఆర్‌ స్నేహిత్‌ పతకం ఖాయం చేశాడు. పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో అడుగుపెట్టిన ఈ 20 ఏళ్ల ఆటగాడు కనీసం కాంస్యం సాధించే అవకాశం కొట్టేశాడు. సోమవారం క్వార్టర్స్‌లో అతను 4-1 (8-11, 12-10, 11-9, 11-8, 11-3) తేడాతో సుష్మిత్‌ శ్రీరాం (టీటీఎఫ్‌ఐ)పై విజయం సాధించాడు.

ఆరో సీడ్‌తో మ్యాచ్‌లో తొలి గేమ్‌లో ఓడినప్పటికీ.. తిరిగి బలంగా పుంజుకున్న స్నేహిత్‌ అద్భుతమైన ఆటతో అదరగొట్టాడు. హోరాహోరీగా సాగిన రెండో గేమ్‌లోనూ కీలక సమయంలో ఆధిపత్యం ప్రదర్శించి పైచేయి సాధించాడు. ఇక మూడు, నాలుగు గేమ్‌ల్లో అదే జోరు కొనసాగించి 3-1తో విజయం ఖరారు చేసుకున్నాడు. అయిదో గేమ్‌లో చెలరేగి ప్రత్యర్థిని చిత్తుగా ఓడించి ఘనంగా మ్యాచ్‌ను ముగించాడు.

అంతకుముందు ప్రీ-క్వార్టర్స్‌లో స్నేహిత్‌.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హర్మీత్‌ దేశాయ్‌కు షాకిచ్చాడు. తనకంటే ఆటలో ఎంతో మెరుగైన ప్రత్యర్థి మీద అతను పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. ఒక్క గేమ్‌ కోల్పోకుండా 4-0 (11-9, 11-7, 11-9, 11-5)తో హర్మీత్‌ను చిత్తుచేశాడు. సెమీస్‌లో సత్యన్‌తో స్నేహిత్‌ తలపడనున్నాడు. మరో సెమీస్‌లో దిగ్గజ ఆటగాడు శరత్‌ కమల్‌తో మానవ్‌ థక్కర్‌ పోటీపడనున్నాడు.

ఇదీ చూడండి: 5జీ టెక్నాలజీతో గ్లోబల్​ చెస్​​ లీగ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.