ETV Bharat / sports

Olympics: తలకు గాయమై.. ఎముకలు విరిగినా..

తలకు పెద్ద గాయమై.. ఎముకలు విరిగితే ఎవరి పరిస్థితైనా ఎలా ఉంటుంది.. కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. అదే ఓ 13 ఏళ్ల బాలికకు ఇలాంటి ఘటన జరిగితే మరింత ఠారెత్తిపోయి ఉంటుంది! కానీ ఆ అమ్మాయి వేగంగా కోలుకోవడమే కాదు.. ఏకంగా ఒలింపిక్స్‌లోనే ఆడబోతోంది. ఈ క్రీడల్లో పోటీపడ్డ అత్యంత పిన్న వయస్కుల జాబితాలో ఆమె కూడా చేరింది. ఆ అమ్మాయే స్కై బ్రౌన్‌. టోక్యోలో స్కేట్‌ బోర్డ్‌ విభాగంలో పోటీ పడుతోంది ఈ బ్రిటన్‌ బాలిక.

brown
బ్రౌన్​
author img

By

Published : Jul 22, 2021, 9:11 AM IST

టోక్యో ఒలింపిక్స్‌కు బ్రిటన్​కు చెందిన బ్రౌన్‌ అర్హత సాధించడమే ఓ అద్భుతం. గత మే నెలలో సాధన చేస్తుండగా ఆమెకు పెద్ద ప్రమాదం ఎదురైంది. రెండు ర్యాంప్‌ల మధ్య నుంచి దూకాలనే ప్రయత్నంలోనే మధ్యలోనే బ్రౌన్‌ నియంత్రణ కోల్పోయింది. దీంతో అనుకున్న ప్రదేశంలో కాకుండా ఈ రెండు ర్యాంప్‌ల మధ్య ఉన్న ప్రదేశంలో పడిపోయింది. దాదాపు 15 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడడం వల్ల పుర్రెకు బలమైన గాయం తగిలింది. అంతేకాకుండా ఎముకలు విరిగాయి. కానీ ఈ అమ్మాయి పెద్ద గండం నుంచి త్వరగా కోలుకుని టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం విశేషం.

"ఆ రోజు ఏం జరిగిందో నాకు గుర్తు లేదు. ఎప్పటిలాగే స్కేటింగ్‌ చేస్తూ ఉన్నా. రెండు ర్యాంప్‌ల మధ్య నుంచి దూకే క్రమంలో గాల్లో కొంచెం సేపు తిరగాలి. ఇలాంటప్పుడు మన వెనకాల ఏముందో చూసే అవకాశం ఉండదు. కానీ నియంత్రణ కోల్పోవడం వల్ల అనుకున్న ప్రదేశంలో కాకుండా ఖాళీలో పడుతున్నట్లు అర్థం అయింది. కానీ ఆ పరిస్థితిలో తప్పించుకునే అవకాశం లేకుండాపోయింది. దెబ్బలు గట్టిగా తగలడం వల్ల చాలా రక్తం పోయింది. అది చాలా క్లిష్ట సమయం. కానీ భయపడకుండా ధైర్యంగా ఉన్నా. మా తల్లిదండ్రులు మళ్లీ స్కేట్‌ బోర్డు జోలికి వెళ్లొద్దని అంటారనుకున్నా కానీ వాళ్లు ప్రోత్సహించారు. అయితే ఒలింపిక్స్‌లో విపరీతమైన ఒత్తిడి ఉంటుందని మా తల్లిదండ్రులు అనుకునేవాళ్లు. కానీ ఎలాంటి ఒత్తిడి ఉండదు.. అవసరమైతే ఏ సమయంలోనైనా తప్పుకోవచ్చు" అని బ్రౌన్‌ పేర్కొంది.

brown
బ్రౌన్‌

టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల పార్క్‌ స్కేట్‌ బోర్డింగ్‌ ఈవెంట్‌లో బ్రౌన్‌ పోటీపడనుంది. 13 ఏళ్ల 23 రోజుల వయసులో ఒలింపిక్స్‌ ఆడబోతున్న ఈ బాలిక.. మార్గ్‌రీ హింటన్‌ (13 ఏళ్ల 44 రోజులు, 1928, ఆమ్‌స్టర్‌డామ్‌ ఒలింపిక్స్‌) తర్వాత బ్రిటన్‌ తరఫున ఒలింపిక్స్‌లో పోటీపడిన పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన ఆమె ఒలింపిక్స్‌లోనూ పతకం గెలవాలనే పట్టుదలతో ఉంది.

ఇదీ చూడండి: ఒలింపిక్​ క్రీడలను ఎప్పుడు, ఎలా చూడొచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.